ఘజియాబాద్: కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను ఘజియాబాద్ అపార్ట్ మెంట్ వాసులు కొత్త నిర్ణయం తీసుకొన్నారు. కొత్త వాళ్లను అపార్ట్ మెంట్లలోకి అనుమతివ్వబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. కొత్తవారికి ఆశ్రయం ఇస్తే విద్యుత్ , వాటర్ నిలిపివేస్తామని హెచ్చరించింది.

కొత్తవారిని అపార్ట్ మెంట్ లోకి అనుమతిస్తే రూ. 11 వేల జరిమానాతో పాటు నీళ్లు, కరెంట్ కూడ కట్ చేస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. జరిమానా చెల్లించేవరకు విద్యుత్, నీళ్ల సేవలు కూడ పునరుద్దరించబోమని హెచ్చరించింది. 

also read:సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: లాక్‌డౌన్ పై తేల్చేస్తారా?

నగరంలోని రాజ్ నగర్ ఎక్స్ టెన్షన్ లోని మూడు సోసైటీలు కంటైన్మెంట్ జోన్ పరిధిలోకి మారాయి. దీంతో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకొన్నామని అసోయేషన్ ప్రకటించింది. 

తాజా నిబంధనలపై అపార్ట్ మెంట్ వాసులు ఆగ్రహంగా ఉన్నారు. ప్లాట్స్ లో నివాసం ఉంటున్న వారిని సంప్రదించకుండా ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకొన్నారని కొందరు ఆరోపిస్తున్నారు.  జరిమానా డబ్బులను పీఎం కేర్స్ కు విరాళంగా ఇస్తామని అసోసియేషన్ ప్రకటించింది.