సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: లాక్‌డౌన్ పై తేల్చేస్తారా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు మధ్యాహ్నం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహిస్తున్నారు.ఈ నెల 17వ తేదీతో లాక్ డౌన్ ముగియనుంది. దీంతో ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్పరెన్స్ కు ప్రాధాన్యత నెలకొంది.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం నాడు మధ్యాహ్నం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహిస్తున్నారు.ఈ నెల 17వ తేదీతో లాక్ డౌన్ ముగియనుంది. దీంతో ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్పరెన్స్ కు ప్రాధాన్యత నెలకొంది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశ వ్యాప్తంగా ఈ ఏడాది మార్చి మూడో వారం నుండి లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇప్పటికే మూడు దఫాలు లాక్ డౌన్ ను విధించింది కేంద్ర ప్రభుత్వం.
కరోనాను వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎంలతో మోడీ చర్చించనున్నారు. రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలపై మోడీ చర్చించనున్నారు.
లాక్ డౌన్ సమయంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించడం ఇది ఐదోసారి. లాక్ డౌన్ నుండి ఎలా బయటకు రావాలనే విషయమై కూడ ఆయా రాష్ట్రాల సూచనలు, సలహాలను ప్రధాని తీసుకొనే అవకాశం ఉంది.
ఆదివారం నాడు ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో కేంద్ర కేబినెట్ సెక్రటరీ వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. వలస కూలీలను స్వగ్రామాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున శ్రామిక్ రైళ్లను ఏర్పాటు చేశారు. ఇంకా చాలా రాష్ట్రాల్లో వలస కూలీలు తమ రాష్ట్రాలకు చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
also read:కరోనా రోగిని కాపాడేందుకు ఎయిమ్స్ డాక్టర్ సాహసం: పీపీఈ కిట్ వదిలి ఇలా....
రాష్ట్రాలు ఆర్ధిక సహాయాన్ని కూడ కోరుతున్నాయి. లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలు ఆర్ధికంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్రత్యేక ప్యాకేజీలు ఇవ్వాలని కోరుతున్నాయి.ఈ విషయమై కేంద్రం కసరత్తు చేస్తోంది.ఈ విషయమై ఈ సమావేశంలో రాష్ట్రాల నుండి మరోసారి కేంద్రం ముందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది.
లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉంది. లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనా వ్యాప్తి చెందకుండా ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే విషయమై కూడ చర్చించే అవకాశం ఉంది.