ఎన్నికైన మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలు ప్రమాణస్వీకారం చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో విచిత్ర ఘ‌ట‌న చోటు చేసుకుంది. దామోహ్ జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీలో కొత్తగా ఎన్నికైన మహిళా సర్పంచ్, ఇత‌ర మ‌హిళా స‌భ్యుల‌కు బ‌దులుగా వారి భ‌ర్త‌లు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇది రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. దీనిపై వివ‌ర‌ణ కావాల‌ని ఉన్న‌తాధికారులు స్థానిక అధికారుల‌ను ఆదేశించారు. 

ప్రజలు మిమ్మల్ని ఓడిస్తుంటే ప్ర‌జాస్వామ్యాన్ని నిందిస్తారా ? - రాహుల్ గాంధీపై బీజేపీ మండిపాటు

దామోహ్ జిల్లాలోని గైసాబాద్ పంచాయతీకిలో ఇది చోటు చేసుకుంది. ఈ గ్రామంలో మూడంచెల పంచాయతీ ఎన్నికల తర్వాత, షెడ్యూల్డ్ తరగతికి చెందిన ఓ మ‌హిళా సర్పంచ్ గా ఎన్నిక‌య్యారు. మ‌రి కొంద‌రు మ‌హిళ‌లు కూడా వార్డు మెంబ‌ర్లుగా విజ‌యం సాధించారు. అయితే వీరంద‌రూ గురువారం ప్ర‌మాణ‌స్వీకారం చేయాల్సి ఉంది. ఈ కార్య‌క్ర‌మానికి ఎన్నికైన మ‌హిళ‌ల‌కు బ‌దులుగా వారి భ‌ర్త‌లే హాజ‌రు అయ్యారు. ఇది బ‌య‌ట‌కు రావ‌డంతో ఈ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మం పెద్ద వివాదంగా మారింది. 

Scroll to load tweet…

అయితే ఈ కార్య‌క్ర‌మానికి మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధుల స్థానంలో భర్తలు హాజరు కావడానికి సంబంధిత అధికారి అనుమతించారనే ఆరోపణలు వ‌స్తున్నాయి. అయితే ఈ ఆరోప‌ణ‌ల్లో నిజా నిజాలు తెలుసుకుని తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ విష‌యంలో దామోహ్ పంచాయితీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) అజయ్ శ్రీవాస్తవ మీడియాతో మాట్లాడుతూ.. ఘటన నిబంధనలకు విరుద్ధంగా కనిపిస్తోందని అన్నారు. ఈ విషయాన్ని పరిశీలించిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రకృతి అంటే ప్రేమ.. చెట్లంటే ప్రాణం: పర్యావరణ రక్షణ కోసం వీరు చేస్తున్న కృషికి వావ్ అనాల్సిందే..

‘‘ ప్రజలు ఎన్నుకున్న మ‌హిళ‌కు బ‌దులుగా కొంత మంది పురుషులు ప్రమాణ స్వీకారం చేసినట్లు మాకు స‌మాచారం వ‌చ్చింది. ఈ విషయంపై వివరణాత్మక విచార‌ణ‌కు మేము ఆదేశాలు జారీ చేశాము. నివేదిక వచ్చిన తర్వాత పంచాయతీ కార్యదర్శి (ఒక వేళ దోషి అని తేలితే) శిక్షార్హుడు అవుతాడు’’ అని సీఈవో అజయ్ శ్రీవాస్తవ అన్నారు.