ఉమ్మడి ఏపీ మాజీ గవర్నర్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్డీ తివారి కుమారుడు రోహిత్ తివారి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులకు సంబంధించి ప్రధాన నిందితురాలిగా అనుమానిస్తూ.. రోహిత్ భార్య అపూర్వను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ నెల 16వ తేదీన రోహిత్ అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. ఆయనది గుండెపోటు అని అందరూ భావించారు. అయితే.. పోస్టుమార్టం రిపోర్టులో ఊపిరాడకుండా చేసి చంపినట్లు తేలిలంది. దీంతో కేసును క్రైమ్ బ్రాంచ్ అధికారులకు అప్పగించారు.
కేసు దర్యాప్తులో భాగంగా రోహిత్ తల్లి ఉజ్వలని విచారించగా... రోహిత్ కి అతని భార్య అపూర్వ మధ్య అంతగా సఖ్యత లేదని.. పెళ్లైన మొదటిరోజు నుంచే వారి మధ్య విభేదాలు తలెత్తాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు రోహిత్ భార్య అపూర్వను ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. దీంతో ఆమెను అరెస్టు చేశారు.