ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె భర్త మీద యాసిడ్ దాడి చేశాడు. మాట్లాడాలని పిలిచి దారుణానికి ఒడిగట్టాడు.
తమిళనాడు : తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాలి భర్తను హతమార్చే ప్రయత్నంలో భాగంగా అతని మీద యాసిడ్ దాడి చేశాడో వ్యక్తి. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెడితే.. తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని వళ్లిపట్టు ఏరి కాలనీకి చెందిన రామన్ (45) మేస్రీ పని చేస్తూ జీవిస్తున్నాడు. అతనికి భార్య వేందామ్మాళ్ (40), ఒక కుమార్తె (12) ఉన్నారు. అయితే భార్యభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఏడాదిగా వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు.
వేందామ్మాళ్ ఓ షూ కంపెనీలో పనిచేస్తుంది. ఈ క్రమంలో రాణిపేటకు చెందిన జేసీబీ డ్రైవర్ శక్తివేలు (26)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం రామన్ కు తెలుసుకుంది. శక్తివేల్ ను బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో గత తొమ్మిదో తేదీ శక్తివేలు.. రామన్ ను మాట్లాడాలంటూ పిలిచాడు. వచ్చిన రామన్ ను అంబూర్ సానాంకరై కన్నదాసన్ నగర సపీపంలోని స్మశానం దగ్గరికి తీసుకువెళ్లాడు.
అక్కడ ఇద్దరూ కలిసి మద్యం తాగారు. ఆ టైంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో గొడవ బాగా పెరిగింది. కోపానికి వచ్చిన శక్తివేల్ తనతో తెచ్చుకున్న యాసిడ్ ను రామన్ మీద పోశాడు. మంటతో రామన్ కేకలు వేశాడు. అది విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అప్పటికే శక్తివేల్ పారిపోయాడు. రామన్ ను చికిత్స నిమిత్తం వాణియంబాడి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధుతుడి ఫిర్యాదు మేరకు ఆంబూర్ పోలీసులు కేసు నమోదు చేసి శక్తివేల్ ను బుధవారం అరెస్ట్ చేశారు.
అర్థరాత్రి పొలాల్లోకి లాక్కెళ్లి.. మహిళ కళ్లు పొడిచిన దుండగుడు...
ఇదిలా ఉండగా, వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించి, యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూసింది ఓ భార్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని లక్కిడం గ్రామానికి చెందిన సింగంపల్లి రాము (43) సోమవారం సాయంత్రం బైక్ మీద విజయనగరం ఆస్పత్రికి వెళ్లి మంగళవారం ఉదయం ఇంటికి తిరిగి రాలేదు. ఉదయం ఆరు గంటల సమయంలో రాము తమ్ముడికి ఫోన్ వచ్చింది. మీ అన్నయ్య కోటర్బిల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు మీద చనిపోయి ఉన్నాడని వారు చెప్పారు. ఘటనా స్థలంలో మృతదేహం ఒక చోట, బైక్ మరొకచోట పడి ఉన్నాయి.
ముందు రోడ్డు ప్రమాదం జరిగి చనిపోయిన ఉంటాడు అని అంతా అనుకున్నారు. అయితే మృతుని తల మీద బలమైన గాయాలు ఉండటంతో.. సోదరుడికి అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయనగరం నుంచి క్లూస్ టీం వచ్చి సంఘటనా స్థలంలో వివరాలు సేకరించారు. అయితే, మృతుడి రాము భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఇదే విషయం మీద వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.
దీంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించిన రాము భార్య తులసి, ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. ఘటన జరిగిన రోజు విజయనగరం ఆసుపత్రికి వెళ్ళాడు. ఆ విషయాన్ని తెలియ జేసింది. ఇద్దరూ కలిసి కొఠారుబిల్లి గ్రామానికి వెళ్లి జంక్షన్ దగ్గర మాటు వేసారు. విజయనగరంలో పని ముగించుకుని వస్తున్న భర్తను ప్రియుడితో కలిసి తులసి చంపించింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయి ఉంటాడని నమ్మించాలని చూసింది. మృతదేహం ఒక చోట, బైక్ను మరొకచోట పడేసి వెళ్లిపోయారు.
