ఇంట్లో నిద్రిస్తున్న మహిళను పొలాల్లోకి లాక్కెళ్లి కళ్లు పొడిచేశాడో దుండగుడు. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది. 

బీహార్ : బీహార్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న ఓ మహిళ(45) ను ఓ వ్యక్తి దగ్గర్లోని జనుము పంటలోకి లాక్కెళ్లాడు. అక్కడ ఆమె కళ్లను పొడి చేశాడు. ఈ ఘటన బీహార్లోని katihar జిల్లాలో వెలుగు చూసింది. తీవ్రంగా గాయడిన ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఈ విషాద సంఘటన దక్లా ఇంగ్లీష్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మహిళపై దాడి చేసి చూపు కోల్పోయేలా చేసిన దుండగుడిని ఎండీ షామీమ్ గా గుర్తించారు పోలీసులు. 

‘నిందితుడు ఎండీ షామిమ్ ను అరెస్ట్ చేశాం. ఈ ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇది అత్యాచారమా కాదా అనేది ఇంకా తెలియరాలేదు’ అని ఎస్ డీపీఓ తెలిపారు. అసలేం జరిగిందంటే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు గ్రామంలో తన 88 ఏళ్ల కుమార్తెతో జీవిస్తుంది. రోజూలాగే మంగళవారం రాత్రి తన కూతురితో కలిసి ఇంట్లో నిద్రపోతుంది. ఆమె భర్త నాలుగు రోజుల క్రితం పని కోసం ఢిల్లీకి వెళ్లాడు. ఆ సమయంలో దుండగుడు ఆమె ఇంటికి వచ్చి డోర్ కొట్టాడు. బాధితురాలు తలుపు తీయగా.. ఆమెను బలవంతంగా సమీపంలోని జనుము తోటలోకి లాక్కెళ్లాడు. 

అక్కడ ఆమె చేతులు కట్టేసి, తన తల్లి కంట్లో కారం పుల్లలను గుచ్చాడని, దీంతో తీవ్ర రక్త స్రావం అయిందని బాధితురాలి కుమార్తె పోలీసులకు తెలిపింది. దాడికి పాల్పడిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు వెంటనే ఆమెను అమ్రాబాద్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం వల్ల కటిహార్ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చూపు వస్తుందన్న నమ్మకం లేదని అక్కడి వైద్యులు తెలిపారు. 

మహిళను రెండు రోజులు హోటల్ గదిలో బంధించి, అత్యాచారయత్నం.. పోలీస్ వ్యాన్ కనిపించడంతో...

ఇదిలా ఉండగా, హర్యానాలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆశపెట్టి ఓ యువతిని హోటల్ గదిలో బంధించారు ఇద్దరు వ్యక్తులు. అందులో ఒకరు ఆమె మీద అత్యాచారయత్నం కూడా చేశారు. 22 ఏళ్ల ఓ మహిళను ఇద్దరు వ్యక్తులు గురుగ్రామ్‌లోని ఓ హోటల్ గదిలో బంధించారు. వారిలో ఒకరు ఆమెను కొట్టి, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ ఉద్యోగాన్వేషణలో ఉంది. దీంతో నిందితుల్లో ఒకరు మంచి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆమెకు ఆశ చూపించాడు. దీనికోసం తనతో సెక్టార్ 46కి రమ్మన్నారు. అక్కడ ఓ హోటల్ గదికి రమ్మని చెప్పి పిలిచారు. 

వారి మాటలు నమ్మి వచ్చిన యువతిని హోటల్ గదిలోకి తీసుకువెళ్లిన తరువాత.. అక్కడే ఆమెను రెండు రోజులు బంధించి ఉంచారు. అంతేకాదు ఆమె మీద నిందితుల్లో ఒకరు ఆమెపై అత్యాచారం చేసేందుకు కూడా ప్రయత్నించారని ఆమె పోలీసులకు తెలిపారు. మంగళవారం రాత్రి, ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నించింది. దీంతో అప్రమత్తమైన ఇద్దరు నిందితులు ఆమెను తమ కారులోకి ఎక్కించుకుని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించారు.

అయితే, బైటికి వెళ్లే గేటు దగ్గర వారికి పోలీస్ వ్యాన్ కనిపించింది. దీంతో నిందితులు ఇద్దరు భయాందోళనకు గురై కారును, మహిళను వదిలి పారిపోయారు. ఇది గమనించిన పోలీసులు కారులోని మహిళను విచారించగా అసలు విషయం బయట పడింది. దీంతో విచారణ ప్రారంభంచిన పోలీసులు నిందితుల్లో ఒకరిని పట్టుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.