ఉత్తరాఖండ్‌లో ఓ మహిళ తన బంధువుతో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను దారుణంగా హతమార్చింది. నిద్రమాత్రలు ఇచ్చి, దిండుతో ఊపిరాడకుండా చేసి చంపేసింది. 

ఉత్తరాఖండ్‌ : వివాహేతర సంబంధాల నేపథ్యంలో కుటుంబాల్ని కూలదోసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఉత్తరాఖండ్ లో మరో ఘటన చోటు చేసుకుంది. కుటుంబపోషణ నిమిత్తం భర్త దుబాయ్ కి వెడితే.. భార్య ఇక్కడ తన బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. 

ఎనిమిది నెలలు వారి బంధం ఎలాంటి అడ్డూ లేకుండా గడిచిపోయింది. తీరా దుబాయ్ లో ఉన్న భర్త తిరిగి స్వదేశానికి తిరిగి రావాలనుకున్నప్పుడు సమస్య తలెత్తింది. ఇక్కడికి వచ్చేసి, భార్య పిల్లలతో కలిసి ఉండాలని.. అందుకోసం ఇంటి దగ్గరే కిరాణ దుకాణం పెట్టుకుని శాశ్వతంగా ఉండిపోవాలనుకున్నాడు.

కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందని.. మీటర్ రీడింగ్ తీసే వ్యక్తి దారుణహత్య...

దీనికి సంతోషించాల్సిన భార్య గుండెల్లో రాయి పడింది. భర్త శాశ్వతంగా ఇక్కడే ఉంటే.. తమ అక్రమ సంబంధం నడవడం ఎలా అని భయపడింది. భర్తను అడ్డుతొలగించుకోవాలనుకుంది. ప్రియుడితో కలిసి హత్యకు పథకం వేసింది. ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. తన బంధువుతో అక్రమ సంబంధం కొనసాగించడం కోసం.. ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. భర్త దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈ వ్యవహారం మొదలైనట్లు సమాచారం.

ఆ మహిళ భర్త తన కుటుంబానికి దూరంగా ఉండలేక.. ఇక్కడే స్థానికంగా దుకాణం పెట్టుకోవాలనుకున్నాడు. దీనికోసం దుబాయ్ నుంచి తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. ఇది నచ్చని అతని భార్య, ఆమె ప్రేమికుడు దారుణానికి ఒడి గట్టాడు. 

భర్త వచ్చిన తరువాత అదును చూసి అతనికి నిద్రమాత్రలు వేశారు. అతను నిద్రపోయిన తరువాత దిండుతో ఊపిరాడకుండా అదిమి, చంపేశారు. అతని మృతికి సంబంధించిన సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. 

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఆ మహిళ తన బంధువుతో గత ఎనిమిది నెలలుగా సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు తన భర్త ఆస్తిని కూడా ఆమె తన సొంతం చేసుకోవాలనుకుందని తెలుస్తోంది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు.