వివాహేతర సంబంధం : ప్రియుడితో పారిపోయి, తిరిగొచ్చి.. ప్రశ్నిస్తున్నాడని భర్తను హతమార్చిన భార్య..
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. ఆ తరువాత అనారోగ్యంతో చనిపోయాడంటూ నాటకం మొదలుపెట్టింది.
కర్ణాటక : వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యాభర్తలు ఆ తర్వాతి కాలంలో అనేక కారణాల వల్ల.. వేరే వ్యక్తుల ఆకర్షణలో పడి వివాహేతర సంబంధాలకు మొగ్గుచూపుతున్నారు. దీంతో తమ బంధానికి అడ్డుగా ఉన్న భార్య లేదా భర్తను హతమార్చి నేరస్తులుగా మారుతున్నారు. అలాంటి ఓ దారుణమైన ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. హత్యకు గురైన వ్యక్తి హోటగళ్లి నివాసి అయిన మంజు(27).
మంజుకు లిఖిత అనే మైసూరు బోగాదికి చెందిన మహిళతో 12 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి ఇద్దరు కొడుకులు. అయితే, మంజుకి వివాహేతర సంబంధం ఉంది. గతంలో కూడా ఒకసారి ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ విషయం పెద్దల పంచాయితీకి వెళ్లేసరికి.. ఆమెను తీసుకువచ్చిన వారు ఇద్దరు మధ్య రాజీ కుదిర్చి.. భర్తకు అప్పగించారు. ఆ తర్వాత తరచూ భార్య ప్రవర్తనను భర్త మంజు ప్రశ్నిస్తూ ఉండేవాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతుండేవి.
నిర్మాణంలో ఉన్న మసీదును ధ్వంసం చేసిన భజరంగ్ దళ్, వీహెచ్ పీ కార్యకర్తలు.. యూపీలో ఘటన
రాజీ కుదిర్చి, భర్తతో వచ్చేసిన తర్వాత కూడా లిఖిత ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించింది. దీనికి తోడు భర్త పదేపదే ప్రశ్నిస్తూ ఉండడం ఆమెకు నచ్చలేదు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడుతో కలిసి కుట్ర పన్నింది. దీంట్లో భాగంగా ఈ మంగళవారం రాత్రి లిఖిత ఇంటికి ఆమె ప్రియుడు వచ్చాడు. అప్పటికి గాఢ నిద్రలో ఉన్న మంజును ఇద్దరూ కలిసి గొంతు పిసికి హత్య చేశారు.
ఆ తర్వాత బుధవారం ఉదయం.. లిఖిత కొత్త నాటకానికి తెరతీసింది. భర్త అనారోగ్యంతో హఠాత్తుగా చనిపోయాడు అంటూ శోకాలు పెట్టింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అంతకుముందు ఫ్యామిలీలో గొడవలు ఉండడంతో లిఖిత మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. విజయనగర పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని.. లిఖితను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఈ కేసులో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.