నిర్మాణంలో ఉన్న మసీదును ధ్వంసం చేసిన భజరంగ్ దళ్, వీహెచ్ పీ కార్యకర్తలు.. యూపీలో ఘటన
యూపీలో నిర్మాణంలో ఉన్న ఓ మసీదును భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ధ్వంసం చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బండా జిల్లా పరిధిలోని బాల్‌ఖండి నాకా స్థలానికి సమీపంలో నిర్మాణంలో ఉన్న మసీదును బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు బుధవారం ధ్వంసం చేశారు. అయితే ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ తోపులాటను అదుపు చేసేందుకు వచ్చిన పోలీసు అధికారులు మూగప్రేక్షకులుగా నిలబడ్డారని ఆరోపణలు వచ్చాయి.
త్రిపురలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు.. 80 శాతంపైగా పోలింగ్ ..
ఈ విధ్వంసం దాదాపు అర గంట పాటు కొనసాగిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఓ నివేదిక ప్రకారం.. ఈ హింసకు పాల్పడిన గుంపు తమ బైక్‌లను రోడ్డు మధ్యలో పార్క్ చేసి, మసీదు నిర్మాణానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించింది. మసీదులోని వస్తువులను రోడ్డుపై విసిరేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
ఈ విధ్వంసంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. కానీ వికృత గుంపును నియంత్రించడానికి బదులు.. రైట్‌వింగ్ గ్రూపు చర్యలను పోలీసులు చూస్తూ ఉండిపోయారని ‘ఈటీవీ భారత్’ నివేదించింది.
ఫేక్ కాల్ సెంటర్లపై సీబీఐ పంజా.. రూ. 3 కోట్లు స్వాధీనం
ఈ విషయంలో వీహెచ్‌పీ బండా జిల్లా అధ్యక్షుడు చంద్రమోహన్ బేడీ మాట్లాడుతూ.. మసీదు పునరుద్ధరణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. కానీ కొత్త నిర్మాణానికి ఎలాంటి అనుమతీ ఇవ్వలేదని తెలిపారు. మసీదును పునరుద్ధరించాలని, కానీ అక్కడ కొత్త నిర్మాణాలు చేపట్టకూడదని, దీనిని తాము అనుమతించబోమని అన్నారు.
కాగా.. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు బండా పోలీసులు తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేశారు.