సుపారీ ఇచ్చి భర్తను చంపించింది: రూ. కోట్ల ప్లాట్ కోసమే...

Wife gives supari for husband over Rs 15 crore plot
Highlights

ఓ మహిళ రూ.15 కోట్ల ఆస్తి కోసం సుపారీ ఇచ్చి తన భర్తను చంపించింది.

కల్యాణ్: ఓ మహిళ రూ.15 కోట్ల ఆస్తి కోసం సుపారీ ఇచ్చి తన భర్తను చంపించింది. కల్యాణ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆస్తిని అమ్మడానికి భర్త నిరాకరించడంతో ఆమె ఆ ఘాతుకానికి ఒడిగట్టింది. 

ఆ మహిళ ఆశా గైక్వాడ్ హిమాంశు దూబేకు రూ.30 లక్షల ఇస్తానని హామీ ఇచ్చి రూ.4 లక్షలు అడ్వాన్స్ గా చెల్లించింది. ఆ మహిళను, హిమాంశు దూబేను పోలీసులు అరెస్టు చేశారు. 

మరో ముగ్గురు అనుమానితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని జగన్ మహాత్రే, రాజ్ సింగ్, ప్రీతంలుగా గుర్తించారు. ఆస్తిని అమ్మడానికి తన భర్త నిరాకరిస్తున్నాడని చెబుతూ అతన్ని చంపడానికి అవసరమైన ప్రణాళిక గురించి ఆశా గైక్వాడ్ తన మిత్రులతో మాట్లాడిన విషయాలను కాల్ రికార్డుల ద్వారా పోలీసులు రాబట్టారు 

మృతుడు శంకర్ గైక్వాడ్ కుటుంబ సభ్యులు అతని భార్య పాత్ర గురించి ఆరోపణలు చేశారు. అతనికి చెందిన ఆస్తిలో 25 వేల చదరపు గజాల భూమిని అమ్మాలని అనుకుందని ఆరోపిస్తున్నారు. ఇందులో డెవలపర్ పాత్ర గురించి కూడా దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు. 

శంకర్ తన భార్య ఆశ, ముగ్గురు పిల్లలతో కలిసి తూర్పు కల్యాణ్ లోని తిస్గావ్ నివసిస్తున్నాడు. మే 18వ తేదీ నుంచి తన భర్త కనిపించడం లేదంటూ ఆశ మే 21వ తేదీన కాల్సేవాడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు ఆశ మొబైల్ ఫోన్ సంభాషణల రికార్డులను పరిశీలించారు. ఆమె దూబేతో తరుచుగా మాట్లాడినట్లు గుర్తించారు. వారిద్దరిని పోలీసులు విచారించారు. వారు నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. 

తాను ఫోన్ లో మాట్లాడడాన్ని వ్యతిరేకించినందున్నే తన భర్తను చంపించాలని అనుకున్నట్లు ఆశా చెప్పారు. శంకర్ కు ఆశ మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చింది. హిమాంశు, తదితరులు అతన్ని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకుని వెళ్లి ఐరాన్ రాడ్లతో కొట్టి, ఆ తర్వాత కత్తులతో పొడిచి చంపారు.

loader