20 ఏళ్ల భర్తపై 40 ఏళ్ల భార్య పైశాచికం.. పారిపోతే వెతుక్కొచ్చి చితక్కొట్టుడే.. చెవులు కాల్చివేత

wife cuts husband ears with gun at kolkata
Highlights

20 ఏళ్ల భర్తను 40 ఏళ్ల భార్య డైలీ చిత్ర హింసలకు గురవ్వడం కోల్‌కతాలో సంచలనం కలిగించింది.

20 ఏళ్ల భర్తను 40 ఏళ్ల భార్య డైలీ చిత్ర హింసలకు గురవ్వడం కోల్‌కతాలో సంచలనం కలిగించింది. కోల్‌కతాకు సమీపంలోని నర్కెల్‌గంగకు చెందిన తన్వీర్‌ రెండేళ్ల క్రితం తనకంటే వయసులో 20 ఏళ్లు పెద్దదైన ముంతాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజులు బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాతి నుంచి ఆమె వ్యవహారశైలిలో బాగా మార్పు వచ్చింది. ప్రతీ రోజు గొడవలు పడటంతో పాటు తన్వీర్‌ను తరచూ చిత్రహింసలకు గురిచేసేది.

భార్య పెట్టే బాధలు భరించలేక అతను ఇంటి నుంచి ఎన్నో సార్లు పారిపోయాడు.. కానీ ముంతాజ్ అనుచరులు ప్రతిసారి అతన్ని పట్టుకొచ్చి ఆమెకు అప్పగించడంతో పాటు దారుణంగా చితకబాదేవారు.. తప్పించుకుపోతే చంపేస్తామని బెదిరించేవారు. తన కుమారుడి బాధను చూసి తట్టుకోలేక విడిచిపెట్టాల్సిందిగా తన్వీర్ తల్లిదండ్రులు ముంతాజ్‌ను ఎన్నోసార్లు బ్రతిమాలారు. చివరకు ఇళ్లు అమ్మగా వచ్చిన డబ్బులు సైతం తీసుకుని కూడా తన్వీర్‌ను ఇంటికి పంపలేదు.

తాజాగా కొద్దిరోజుల క్రితం తన్వీర్ మరోసారి ఇంటి నుంచి పారిపోయి మల్లిక్‌పూర్ అనే ప్రాంతంలో తలదాచుకున్నాడు.. వెంటనే ముంతాజ్ అనుచరులు ఆ ప్రాంతానికి వెళ్లి తన్వీర్‌ను పట్టుకుని వచ్చారు.. ఆ రోజు రాత్రి భర్తను చెల్లెళ్లతో కలిసి దారుణంగా హింసించింది ముంతాజ్.. అక్కడితో ఆగకుండా కోపంతో తన్వీర్ రెండు చెవులను గన్నుతో కాల్చింది. తీవ్రంగా రక్తస్రావం కావడంతో భర్త చనిపోయాడని భావించి అక్కడి నుంచి పారిపోయింది..

అతడు కొనవూపిరితో కొట్టుమిట్టాడుతూ తన తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నాడు.. అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు అతని ప్రాణాలు కాపాడారు. తన్వీర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పరారీలో ఉన్న భార్య ముంతాజ్ ఆమె చెల్లెళ్ల కోసం గాలిస్తున్నారు.

loader