అనుమానంతో.. తొలిరాత్రే భార్యను వేధించాడు ఓ మహానుభావుడు. కాగా.. ఆ వేధింపులు.. రోజురోజుకీ తీవ్ర తరం కావడంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
అనుమానంతో.. తొలిరాత్రే భార్యను వేధించాడు ఓ మహానుభావుడు. కాగా.. ఆ వేధింపులు.. రోజురోజుకీ తీవ్ర తరం కావడంతో.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆరునెలల క్రితం నగరానికి చెందిన యువతితో వివేక్ రాజగోపాల్‌కు వివాహమైంది. వివేక్ రాజగోపాల్ వివాహమైన మొదటి రాత్రిలోనే భార్య ప్రవర్తన పట్ల అనుమానం మొదలైంది.
అంతేగాక మా తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక నిన్ను వివాహం చేసుకున్నానని, తనను వదిలి పెట్టి వెళ్లి పోవాలని భార్యతో తెలిపాడు. వివేక్ భార్యను ఉద్యోగానికి పంపించి తనకు వచ్చిన జీతం డబ్బు ఇవ్వాలని వేధించడంతో పాటు తనతో అసభ్యంగా మాట్లాడే ఆడియో, బెడ్‌రూమ్ వీడియోతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నట్లు తెలిపింది.
డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో ఆడియో, వీడియో అప్‌లోడ్ చేస్తానని బెదిరిస్తున్నట్లు బాధితురాలు ఆరోపించింది. తన భర్తకు ఉన్న డబ్బు వ్యామోహానికి తీవ్రమనస్థాపం చెందిన గృహిణి పుట్టింటికి వెళ్లిన అనంతరం ఘటన పట్ల బనవనగుడి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పెళ్లైన మొదటిరాత్రే తన భర్త తనపై అనుమానంతో తన మొబైల్‌ఫోన్‌లోని కాల్స్, మెసేజ్‌లను పరిశీలించాడని, ఆ తరువాత ప్రతి రోజు అనుమానించడం మొదలుపెట్టినట్లు బాధితురాలు పోలీసుల ముందు వాపోయింది. అతనిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పోలీసులను కోరుతోంది.
