చెన్నై: ఓ బ్యాంక్ ఉద్యోగి రాసలీలలను అతని భార్యనే బయటపెట్టింది. మహిళలను లోబరుచుకుని వారితో రాసలీలలు నడిపినట్లు అతని భార్య బయటపెట్టిన ఫోటులు, వీడియోల ద్వారా తెలుస్తోంది. దాదాపు 40 మంది మహిళలతో అతను రాసలీలను సాగించినట్లు తెలుస్తోంది. ఆరెస్టు భయంతో అతనితో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నారు. 

తమిళనాడులోని తిరుచ్చిరాపల్ిల జిల్లా మనప్పారైకి చెందిన ఎడ్విన్ జయకుమార్ (36) పుదుకొట్టయ్ జిల్లా వీరాలిమలైలోని గల ఇండియన్ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తున్నాడు. తంజావూరు జిల్లా వల్లం సమీపంలోని రెడ్డిపాళయానికి చెందిన యువతి (32)తో నిరుడు డిసెంబర్ 2వ తేదీన అతనికి వివాహమైంది. 

పెళ్లి జరిగిన రోజు నుంచే జయకుమార్ తన ఇంటిలోని ఓ గదిలో గంటల తరబడి పలువురు మహిళలతో అశ్లీలంగా మాట్లాడుతూ తనతో సరిగా ఉండకపోవడాన్ని ఆమె గ్రహించింది. భర్త బ్యాంకుకు వెల్లిన సమయంలో అతని గదిని పరిశీలించింది. అందులో 15 సెల్ ఫోన్లు, వాటిలో జయకుమార్ 40మందికి పైగా మహిళలతో, బ్యాంక్ ఖాతాదారులతో అర్థనగ్నంగా, నగ్నంగా ఉన్న చిత్రాలు, బాత్రూమ్ వీడియోలు, ఎస్ఎంఎస్ లు చూసింది. 

ఆ విషయాలను తన అత్త, ఆడపడుచు, అత్తింటివారి ఇతర మహిళా బంధువులకు చెప్పింది. అయితే, వారు దాన్ని పట్టించుకోలేదు. అయితే, తన వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులకు చెప్పిందని భార్యను జయకుమార్ దూషించాడు. దానికితోడు మరో విధంగా కూడా ఆమెను బెదిరించాడు. 

నువ్వు స్నానం చేస్తున్నప్డు వీడియో తీసి జాగ్రత్త చేశానని, ఆ విషయాలు ఎవరికైనా చెప్తే దాన్ని సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించాడు. అతడితో పనిచేసే ఉద్యోగిని కూడా ఆమెను బెదిరించింది. అయితే, విషయాలను ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. వారు జయకుమార్ ను నిలదీశారు. 

తన గుట్టు రట్టు చేసిన భార్యను హత్య చేయడానికి జయకుమార్ పథక రచన చేశాడు. ఆలయాల సందర్శన పేరుతో భార్యను బయటకు తీసుకుని వెళ్లి రెండు సార్లు చంపడానికి ప్రయత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకుని తంజావూరు సర్కిల్ డీఐజీ లోకనాథ్ కు ఆమె ఫిర్యాదు చేసింది. 

ఆమె ఫిర్యాదుతో పోలీసులు బాధితురాలి భర్త జయకుమార్, అతని తల్లి విల్లీ హైడా, సోదరి కేథరిన్ నిర్మలా మేరీ, బంధువు రీటా, జయకుమార్ తో పాటు పనిచేసే మహిళ దేవీ బిలోమీనాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

దాన్ని పసిగట్టిన జయకుమార్ మదురై కోర్టులో ముందస్తు బెయిల్ పొందాడు. దీంతో తాను దాచిపెట్టిన భర్త రాసలీలల వీడియోలను, ఫొటోలను బాధితురాలు మదురై కోర్టుకు సమర్పించింది. దాంతో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ విషయం తెలిసి జయకుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పారిపోయాడు.