ఓ వివాహిత చాక్లెట్ కొనివ్వలేదన్న చిన్న కారణానికి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన కర్ణాటకలో కలకలం రేపింది.  

కర్ణాటక : చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి సంఖ్య నేటి కాలంలో ఎక్కువవుతోంది. క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతూ కుటుంబాన్ని విషాదంలోకి నడుతున్నారు. అలాంటి ఓ ఘటనే కర్ణాటకలోని హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కృష్ణరాజపురంలో ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి కారణం తెలిస్తే.. ఆశ్చర్యంతో నోట మాట రాదు. కుటుంబ కలహాల నేపథ్యంలోనో, ఆర్థిక ఇబ్బందుల కారణంగానో.. వివాహేతర సంబంధం కారణంగానో.. పిల్లలు పుట్టలేదనో.. భర్త తాగొచ్చు కొడుతున్నాడనో.. చెడు వ్యసనాలకు అలవాటై ఇబ్బందులకు గురి చేస్తున్నాడనో.. ఆమె ఆత్మహత్య చేసుకోలేదు.

భర్త చాక్లెట్ కొనివ్వలేదని ఉరి వేసుకుని చనిపోయింది. కొత్తగా పెళ్ళైన మహిళ కూడా కాదు ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నందిని (30) అనే మహిళ హెణ్ణూరు పోలీస్ స్టేషన్ పరిధిలో భర్తతో కలిసి ఉంటుంది. ఆరేళ్ల క్రితం వివాహమైన వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. నందిని భర్త సెలూన్ నడుపుతున్నాడు. రోజులాగే గురువారం ఉదయం భర్త సెలూన్ కు వెళ్లడానికి రెడీ అయ్యాడు.. ఆ సమయంలో తనకు చాక్లెట్ తెమ్మని తెలిపింది. ఏమి చెప్పకుండా భర్త వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎంతసేపైనా అతను ఇంటికి రాలేదు. దీంతో మనస్థాపం చెందిన నందిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

చోరీ చేసి డబ్బు ఎత్తుకెళ్లారు.. తెల్లారి మళ్లీ అక్కడే వదిలివెళ్లారు.. ఛత్తీస్‌గఢ్‌ లో విచిత్ర ఘటన

మధ్యాహ్నం భర్త సెలూన్ నుంచి ఫోన్ చేశాడు. కానీ నందిని లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన భర్త ఇంటికి వచ్చి చూడగా నందిని ఆత్మహత్య చేసుకునే కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలా ఉండగా, మార్చి 31న ఓ చిన్నారి ఆత్మహత్య తమిళనాడులో కలకలం రేపింది. నేటి కాలంలో రీల్స్ చేయడం చిన్నా, పెద్దా అందరికీ ఓ అలవాటుగా మారిపోయింది. అలవాటు అనేకంటే అడిక్షన్ అనడం కరెక్టేమో. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రీల్స్ పిచ్చితో ఓ తొమ్మిదేళ్ల చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలోని తిరువళ్లువార్ కు చెందిన ప్రతిషా అనే అమ్మాయి సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండేది. ప్రతిషా వయసు 9 సంవత్సరాలు. ఆ వయసులో చదువుకోకుండా రీల్స్ చేయడం సరికాదని తండ్రి ఆమెను మందలించాడు. 

చదువు మీద దృష్టి సారించాలని గట్టిగా చెప్పాడు. దీంతో చిన్నారి తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇంట్లో నుంచి తండ్రి బయటికి వెళ్ళగానే గదిలోకి వెళ్లి ఫ్యాన్కు ఉరి వేసుకుంది. ఇది గమనించిన ఇంట్లోని మిగతా కుటుంబ సభ్యులు వెంటనే ప్రతీషాను ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆ చిన్నారిని పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనతో ఆ కుటుంబం శోకంలో మునిగిపోయింది. చదువుకోమని తండ్రి చెప్పడమే తప్పుగా మారింది. ఈ విషాద ఘటన స్థానికంగా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిమీద పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.