Asianet News TeluguAsianet News Telugu

ఏకాదశి రోజు భర్త చికెన్ వండమన్నాడని.. ఒంటిమీద కిరోసిన్ పోసుకుని భార్య ఆత్మహత్య.. !!

కోడి కూర వండ లేదన్న కోపంతో భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవ ప్రాణాల మీదికి తీసుకువచ్చింది.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఇరుగుపొరుగు సహాయంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. చంపారన్ జిల్లాలోని bethiya నగరంలో నాగేంద్ర సింగ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. 

wife committed suicide after husband pressurize to cook chicken in bihar
Author
Hyderabad, First Published Nov 18, 2021, 5:52 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కలకాలం తోడుంటామంటూ ఒక్కటైన జంట చిన్నపాటి గొడవలతో ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. అలాంటి ఒక ఘటన బీహార్ రాష్ట్రంలోని పశ్చిమ చంపారన్ జిల్లాలో వెలుగుచూసింది.

కోడి కూర వండ లేదన్న కోపంతో భార్యాభర్తల మధ్య గొడవ ప్రాణాల మీదికి తీసుకువచ్చింది.  ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి ఇరుగుపొరుగు సహాయంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచింది. చంపారన్ జిల్లాలోని bethiya నగరంలో నాగేంద్ర సింగ్ అనే వ్యక్తి పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది.  

తన అల్లుడు తన కూతురిని హత్య చేయాలని ప్రయత్నించాడని,  ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని  నాగేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు విచారణ చేయగా.. భార్యాభర్తల మధ్య జరిగిన చిన్నపాటి  గొడవే ప్రాణాల మీదికి తెచ్చిందని తేల్చారు.  పోలీసుల కథనం ప్రకారం.. బేతియా నగరానికి చెందిన Rahul Kumar (26)కు  పక్క గ్రామం pahadpur లో నివసించే  నాగేంద్ర సింగ్ కుమార్తె ఆర్తి దేవి (19) తో 8 నెలల క్రితం వివాహం జరిగింది.

ఆర్తి దేవికి చిన్నప్పటి నుంచి Non-vegetarian తినడం ఇష్టం లేదు. ఎక్కువగా శాకాహారమే  తినేది. కానీ  రాహుల్ కుమార్ కు చికెన్, మటన్ అంటే చాలా ఇష్టం.  వీరిద్దరికీ వివాహమైన తర్వాత ఆర్తి దేవి మాంసాహారం వండడానికి భర్తతో తరచుగా గొడవ పడేది.  తాను తినక పోయినా భర్త సంతోషం కోసం అప్పుడప్పుడు 
Chicken వండేది.  కానీ రాహుల్ కు మాత్రం రోజు  మాంసాహారం కావాలి. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.

ఇదే క్రమంలో రాహుల్ కుమార్ నవంబర్ 15న ఇంటికి  చికెన్ తీసుకొచ్చి భార్యను వడ్లమన్నాడు.  ఆ రోజు Ekadashi కావడంతో ఆర్తి మాంసాహారాన్ని ముట్టుకోను అని చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మళ్ళీ గొడవ మొదలైంది.  ఒక వైపు రాహుల్ ఎలాగైనా ఈ రోజు చికెన్ తినాల్సిందే పట్టుకుని కూర్చోగా మరో వైపు ఆర్తి ఏకాదశి రోజు ఇంట్లో మాంసాహారం  వండడానికి వీలు లేదని భీష్మించుకు కూర్చుంది.

మా గురుద్వారాలో నమాజ్ చేసుకోండి.. గుర్గావ్‌లో గురుద్వారా అసోసియేషన్ కీలక నిర్ణయం

చివరికి రాహుల్కు ఏం చేయాలో తోచక ఇంటి బయట వరండాలో చికెన్ వండడం మొదలుపెట్టాడు.  ఇది గమనించిన ఆర్తి..  భర్త రాహుల్ చాలా పెద్ద తప్పు చేశాడని…  ఏకాదశి రోజు అలా చేయడం ఇంటికి అరిష్టం అని భావించిన ఆర్పి తీవ్ర మనస్థాపానికి లోనయింది.  ఒంటిపై Kerosene పోసుకుని నిప్పంటించుకుంది.  దీంతో తీవ్ర గాయాలపాలైంది.  ఇది గమనించిన రాహుల్ వెంటనే మంటలను ఆర్పి, ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.  ఈ క్రమంలో భర్త రాహుల్ కూడా స్వల్పంగా గాయపడ్డాడు.
 
ఆసుపత్రిలో డాక్టర్ ఆర్తి శరీరం 90% కాలిపోయిందని కాపాడడం చాలా కష్టమని చెప్పారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 16న ఆర్తి ప్రాణాలు వదిలింది.  భర్త వేధింపులు కారణంగా  తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని నిందితుడిని కఠినంగా శిక్షించాలని  ఆర్తి తండ్రి నాగేంద్ర సింగ్ పోలీసులను  కోరారు.

 కాగా ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ఆర్తి శవాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.  మరో వైపు ఆర్తి మరణం కేసు ని పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు.  రాహుల్ని చంపేస్తామని ఆర్తి కుటుంబ సభ్యులు బెదిరిస్తూ ఉండడంతో రాహుల్ కు పోలీసుల రక్షణలో చికిత్స జరుగుతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios