Asianet News TeluguAsianet News Telugu

మా గురుద్వారాలో నమాజ్ చేసుకోండి.. గుర్గావ్‌లో గురుద్వారా అసోసియేషన్ కీలక నిర్ణయం

హర్యానాలోని గుర్గావ్‌లో కొంతకాలంగా ప్రతి శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ముస్లింలు బహిరంగంగా ప్రార్థనలు చేసే ప్రాంతాల్లో స్థానికులు కొందరు ఆందోళనలు చేస్తున్నారు. వారు బహిరంగంగా ప్రార్థనలు చేయవద్దని, వారికి ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సదర్ బజార్‌లోని గురుద్వారాలో ముస్లిం సహోదరులు ప్రార్థనలు చేసుకోవచ్చని గురుద్వారా అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది.
 

gurudwara decided to allow muslims to do prayers in gurgaon
Author
Gurgaon, First Published Nov 18, 2021, 5:20 PM IST

గుర్గావ్: Haryanaలోని Gurgaonలో కొంత కాలంగా ముస్లిం Namaz చుట్టూ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాల్లోనూ Muslims శుక్రవారం Prayers చేయడంపై తీవ్ర నిరసనలు వచ్చాయి. వందలాది మంది నమాజ్ చేసే బహిరంగ ప్రాంతాలకు తరలివచ్చి బెదిరించిన ఘటనలూ చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే గుర్గావ్‌లోని సదర్ బజార్ గురుద్వారా అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి శుక్రవారం ముస్లిం సహోదారులు తమ Gurudwaraకు వచ్చి ప్రార్థనలు చేసుకోవచ్చునని ఆఫర్ ఇచ్చింది. జుమ్మే కీ నమాజ్ చేయాలనుకునే ముస్లిం సహోదరులు గురుద్వారాలోని బేస్‌మెంట్‌లో ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపింది.

గురువు నివాసమని పేర్కొంటూ ఈ అవకాశాన్ని గురుద్వారా గురు సింగ్ సభ, సదర్ బజార్, అధ్యక్షుడు షెర్దిల్ సింగ్ సిద్దూ ప్రకటించారు. ఈ నివాసంలో ఏ కమ్యూనిటీకి వివక్ష ఉండదని తెలిపారు. ఇక్కడ ఎలాంటి రాజకీయాలూ ఉండరాదని పేర్కొన్నారు. జుమ్మే కీ నమాజ్ చేయాలనుకునే ముస్లిం సహోదారులు గురుద్వారా బేస్‌మెంట్‌లో చేసుకోవచ్చని వివరించారు.

Also Read: నమాజ్ ప్రార్థనలకు వ్యతిరేకంగా ఆందోళనలు.. 30 మంది అరెస్టు

బహిరంగ ప్రదేశం ఉన్నప్పుడు ముస్లింలను నమాజ్ చేసుకోవడానికి అనుమతించాలని ఆయన అన్నా రు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు గొడవలు పడవద్దని తెలిపారు. బహిరంగ ప్రాంతాల్లో నమాజ్ చేయానుకున్నవారు గతంలోనే అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతులు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. అయితే, దానిపై అభ్యంతరం ఉన్నవారూ అలాగే అడ్మినిస్ట్రేషన్‌కు వెళ్లి తమ సమస్యలు చెప్పుకోవాలని అన్నారు. అంతేకానీ, నేరుగా ప్రార్థనలు చేసుకునే చోటుకు వచ్చి దాడులు చేయవద్దని చెప్పారు.

గుర్గావ్‌లో 37 ప్రాంతాల్లో నమాజ్ చేయడానికి ముస్లింలకు అనుమతులు ఉన్నాయి. తాజాగా, ఇందులో ఎనిమిది చోట్ల నమాజ్ ప్రార్థనలు చేయడానికి ఇచ్చిన అనుమతులను గుర్గావ్ అడ్మినిస్ట్రేషన్ వెనక్కి తీసుకుంది. స్థానికులు కొందరు తీవ్ర అభ్యంతరం తెలిపిన నేపథ్యంలోనే ఈ అనుమతులను వెనక్కి తీసుకున్నట్టు అధికారిక ప్రకటన ఒకటి వివరించింది.

Also Read: అసెంబ్లీలో ప్రత్యేకంగా నమాజ్ రూమ్.. ‘హరే రామా’ నినాదాలతో బీజేపీ ఎమ్మెల్యే ఆందోళనలు

కొన్ని నెలలుగా గుర్గావ్‌లో ప్రతి శుక్రవారం ముస్లింలు ప్రార్థన చేసే బహిరంగ ప్రాంతాల్లో కొందరు నిరసనలు చేస్తున్నారు. బహిరంగంగా వారు ప్రార్థనలు చేయవద్దని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే వారికి ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకోవాలని ఆందోళనలు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలే 2018లో చోటుచేసుకన్నాయి. అప్పుడే హిందు, ముస్లింలు చర్చించుకున్నారు. ఆ తర్వాత 37 ప్రాంతాలు నమాజ్ చేసుకోవచ్చనే అంగీకారానికి వచ్చారు. అందులోనే సెక్టార్ 12ఏ, సెక్టార్ 47లు ఉన్నాయి. కానీ, గత కొన్ని వారాలుగా ఈ రెండు ప్రాంతాల్లో నమాజ్ చేసుకునే సమయంలో ఉద్రిక్తతలు ఏర్పడుతున్నాయి. నమాజ్‌ను ఆటంకపరుస్తూ ఇక్కడ ఆ ప్రార్థనలు చేయడానికి వీల్లేదని, వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios