Asianet News TeluguAsianet News Telugu

కొడుకుతో అక్రమ సంబంధం అనుమానం.. భర్త, సవతి కొడుకు కలిసి మహిళ తల నరికి, వేళ్లు కోసేసి..

ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో శుక్రవారం తలలేని మృతదేహాం దొరికింది. ఈ కేసులో ఆ మహిళ భర్త, అతని ఇద్దరు కుమారులు, మేనల్లుడుని పోలీసులు అరెస్టు చేశారు. 

wife assasinated by husband over suspected Illicit relationship with step son, beheaded, chop off fingers in Uttar Pradesh - bsb
Author
First Published Sep 30, 2023, 11:27 AM IST

ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన  వెలుగు చూసింది. ఓ మహిళను ఆమె భర్త అత్యంత దారుణంగా హతమార్చాడు. రెండో భార్య అయిన ఆమెను మొదటి భార్య కొడుకులు, తన మేనల్లుడితో కలిసి హతమార్చాడు. ఆ తరువాత తలను మొండెనుంచి వేరు చేశాడు. చేతివేళ్లు నరికేశాడు. మృతదేహాన్ని నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. 

ఈ హత్య ఘటన వెలుగు చూడడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. అయితే, ఈ హత్యకు కారణం తన కుమారుల్లో ఒకరితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని ఆ వ్యక్తి అనుమానించి హత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీంతో భర్త, అతని ఇద్దరు కొడుకులు, అతని మేనల్లుడిని అదుపులోకి తీసుకున్నారు. 

200 మంది మహిళల ఫొటోలు తీసి, అశ్లీలంగా మార్చిన ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ ఉద్యోగి.. తరువాత ఏం జరిగిందంటే ?

ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం బందా జిల్లాలో నాలుగు వేళ్లు తెగిపోయి... తల లేని మహిళ మృతదేహాన్ని కనుగొన్నారు. దీనికి సంబంధించి పోలీసు సూపరింటెండెంట్ అంకుర్ అగర్వాల్ ఏం చెబుతున్నారంటే.. సుమారు 35-40 సంవత్సరాల వయస్సు గల మహిళ మృతదేహం అది. ఆమె ఒంటిపై దుస్తులు అరకొరగా ఉన్నాయి. 

ఆమె తల ఆమె శరీరానికి కొంత దూరంలో కనిపించింది. మృతదేహం మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాకు చెందిన రామ్‌కుమార్ అహిర్వార్ భార్య మాయాదేవిగా గుర్తించారు. మృతదేహం వేళ్లు కూడా కట్ చేశారు. అంతేకాదు.. ఆమెను గుర్తించకుండా ఉండాలని మహిళ జుట్టును కత్తిరించి, ఆమె పళ్లను రాలగొట్టారని పోలీసులు కనుగొన్నారు.

ప్రాథమిక విచారణ తర్వాత, హత్యలో మహిళ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. విచారణలో భర్త రామ్‌కుమార్‌, అతని కుమారులు సూరజ్‌ ప్రకాష్‌, బ్రిజేష్‌, మేనల్లుడు ఉదయ్‌భన్‌లు మహిళ హత్యకు తామే కారణమని ఒప్పుకున్నారని ఎస్పీ తెలిపారు.

రామ్‌కుమార్ వాంగ్మూలం ప్రకారం, మాయా దేవి అతని రెండవ భార్య, ఆమె తన కుమారులలో ఒకరితో సంబంధం కలిగి ఉన్నట్లు అనుమానించాడని అగర్వాల్ చెప్పారు. దీంతో కోపోద్రిక్తులైన నలుగురు నిందితులు మాయాదేవిని చమ్రహ గ్రామానికి తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేసి, గొడ్డలితో తల నరికి చంపారు. ఆమె నాలుగు వేళ్లను కూడా కత్తిరించారు. నేరానికి ఉపయోగించిన వాహనం, గొడ్డలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.

ఈ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులందరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని ఎస్పీ అంకుర్ అగర్వాల్ తెలిపారు. వారిపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. "నా వైపు నుండి పోలీసు బృందానికి రూ. 25,000 రివార్డ్ ఇవ్వబడుతుంది" అని పోలీసు అధికారి తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios