ఆన్లైన్ స్ట్రీమింగ్ వీడియోలు చూసి కొందరు నేరాలు ఎలా చేయాలో నేర్చుకుంటున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా నిందితుల జాబితాలో ఎందుకు చేర్చలేదని తమిళనాడు పోలీసులకు మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది యూట్యూబ్ నమోదైన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ప్రశ్నలను లేవనెత్తింది.
చెన్నై : ‘యూ ట్యూబ్ లో వీడియో చూసి బాంబు తయారీ’..., యూట్యూబ్ లో చూసి ఏటీఎం ఛోరీ’.., ‘యూ ట్యూబ్ లో చూసి ఆత్మహత్య’.., ‘యూ ట్యూబ్ లో చూసి గ్యాంగ్ స్టర్ గా మారాలని హత్యలు’.. ఇలా యూ ట్యూబ్ లో చూసి నేర్చుకునేవారు చాలామందే కనిపిస్తున్నారు. నేటి రోజుల్లో మంచి కంటే చెడు ఎక్కువ తొందరగా వ్యాపిస్తోందనడానికి ఇదే నిరూపణ. యూట్యూబ్, సోషల్ మీడియాల్లో చూసి.. లేదా వాటిల్లో వార్తలు, వీడియోలు ప్రచురించి బ్లాక్ మెయిల్ చేయడం.. కించపరచడం ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో మద్రాస్ హై కోర్టు సంచలన నిర్ణయానికి తెరలేపింది.
Online streaming videoలు చూసి కొందరు Crimes ఎలా చేయాలో నేర్చుకుంటున్న నేపథ్యంలో Social media platformల్ని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చడం లేదని తమిళనాడు పోలీసులను Madras High Court ప్రశ్నించింది. దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఓ YouTuberపై నమోదైన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ ప్రశ్నలను లేవనెత్తింది.
అసత్యాలతో వీడియోలు రూపొందిస్తున్నారంటూ దురైమురుగన్ అనే యూట్యూబర్ ను పోలీసులు అరెస్ట్ చేయగా.. అతడికి బెయిల్ మంజూరు అయ్యింది. అయితే, నిందితుడి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ Tamil Nadu Police మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిగింది. టెక్నాలజీ దుర్వినియోగాన్ని ఏమాత్రం అనుమతించబోమని, నిందితుడు దురైమురుగన్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదించాడో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
ఈ సందర్భంగా సోషల్ మీడియా దుర్వినియోగంపై కోర్టు స్పందిస్తూ ‘కొంతమంది డబ్బు సంపాదన కోసం సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు. ఇంకొందరు గన్స్ ఎలా తయారు చేయాలో, బాంబులు ఎలా తయారుచేయాలో, దొంగతనాలు, మోసాలు, హత్యలు, దోపిడీలు ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటున్నారు.
ఇలాంటి సైబర్ క్రైమ్ కేసుల్లో సోషల్ మీడియా వేదికల్ని నిందితుల జాబితాలో ఎందుకు చేర్చడం లేదు? అంటూ న్యాయస్థానం పోలీసులను ప్రశ్నించింది. యూట్యూబ్ దుర్వినియోగం కాకుండా విధివిధానాలను రూపొందించాలని తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా, శుక్రవారం ఢిల్లీలో ఇలా సినిమాలు, వెబ్ సిరీస్ చూసి టీనేజ్ యువకులు చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ‘పుష్ప, భౌకాల్ వంటి సినిమాలు, Web series చూసి మాకు కూడా అలా చేయాలనిపించింది. వాటిలో చూపించిన Gangsters జీవనశైలి మమ్మల్ని ఆకట్టుకుంది’... చిరుప్రాయంలో హంతకులుగా మారిన ముగ్గురు చిన్నారులు ఇలా చెప్పుకుంటూ పోతే ఢిల్లీ పోలీసులు నోళ్లు వెళ్లబెట్టారు. దేశ రాజధాని నగరంలో jahangirpuri ప్రాంతంలో ఈ ముగ్గురూ కలిసి ఓ అమాయకుడిని murder చేశారు.
అంతటితో ఆగకుండా చేసిన హత్యను ఆద్యంతం video తీశారు. దీని Instagramలో అప్లోడ్ చేయాలన్నది వారి ఆలోచన. కేవలం నేర ప్రపంచంలో పేరు తెచ్చుకోవాలనే కోరికతోనే వీరు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులు గురువారం వెల్లడించారు. ముగ్గురిని అరెస్టు చేశారు.
