పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాక్ భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు దూసుకెళ్లి.. ఉగ్రవాదుల శిబిరాలపై బాంబుల వర్షం కురిపించాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 శత్రుదేశపు యుద్ధ విమానాలు తమ గగనతలంలోకి ప్రవేశిస్తే పాకిస్తాన్ ఎందుకు కనిపెట్టలేకపోయింది.

దాయాది కన్నుగప్పి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎలా విజయవంతంగా పని పూర్తి చేసి తిరిగి రాగిలిగిందన్న దానిపై ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దులలో యుద్ధ విమానాల కదలికలను పసిగట్టేందుకు పాక్‌కు పటిష్ట రాడార్ వ్యవస్థ ఉంది.

కింద నుంచి వెళ్లే విమానాలను గుర్తించేందుకు సైతం ‘‘బలూన్ బరాజ్’’ అనే నిఘా వ్యవస్థ సైతం దాయాదికి వుంది. అయితే పాక్ రాడార్లు ఎందుకు విఫలమయ్యాయి అంటే... ఎంత గొప్ప రాడార్ అయినా కొన్ని బలహీనతలు ఉంటాయి.

శత్రుదేశాల సరిహద్దు మొత్తం పైనా రాడార్లతో నిఘా పెట్టడం అసాధ్యం.. రాడార్లు కనిపెట్టలేని దారిలో వెళ్లడం ద్వారా వాటి కళ్లుగప్పవచ్చు. అయితే మంగళవారం నాడు భారత యుద్ధ విమానాలు అనుసరించిన వ్యూహం ప్రకారం.... భారత్ అనూహ్యమైన మార్గంలో గానీ, తక్కువ ఎత్తులో గానీ ఎగురుతూ పాక్ నిఘా వ్యవస్ధను బురిడీ కొట్టించి వుండవచ్చు.

అలాగే మిరాజ్, సుఖోయ్ యుద్ధ విమానాల్లో ఉన్న అత్యాధునిక జామర్లు పాత కాలపు పాక్ రాడార్లను జామ్ చేసి వుండవచ్చని వాదన సైతం వినిపిస్తోంది. మరోవైపు నిఘా వ్యవస్థతో పాటు పాక్ ప్రతిస్పందన సామర్ధ్యం బలహీనం...

నియంత్రణ రేఖ వెంబడి సుఖోయ్ యుద్ధ విమానాల తరంగాలను నిరోధించే పనిలో పాక్ గస్తీ విమానాలు ఉండగా... మిరాజ్‌లు లోపలికి వెళ్లి పని పూర్తి చేసి వుండవచ్చని పలువురు రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. 

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

పుల్వామాకు ప్రతీకారం: 300 మంది ఉగ్రవాదులు హతం..?

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే

పాక్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి, 21 నిమిషాల్లో పనికానిచ్చిన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్

సర్జికల్స్ స్ట్రైక్స్‌-2కు మిరాజ్‌-2000నే ఎందుకు వాడారంటే..?