పుల్వామా దాడికి ఎప్పుడెప్పుడు ప్రతీకారం తీర్చుకుందామా అని భారత సైన్యం ఎదురుచూస్తుండగా మంగళవారం తెల్లవారు జామున ఆ సమయం వచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఆర్మీ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది.

12 మిరాజ్ యుద్ధవిమానాలు తెల్లవారుజామున పీఓకే‌లోకి దూసుకెళ్లి ఉగ్రవాద క్యాంపులపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో బాలాకోట్ కేంద్రంగా ఉన్న జైషే శిబిరాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది.

ఈ దాడిలో సుమారు 200 మంది ఉగ్రవాదులు హతమైఉంటారని భావిస్తున్నారు. మరోవైపు భారత యుద్ధ విమానాలు ఎల్‌ఓసీ దాటినట్లు పాకిస్తాన్ ప్రకటించింది.

భారత యుద్ధ విమానాలను తరిమి కొట్టాం: పాక్ ఆర్మీ

సర్జికల్ స్ట్రైక్స్-2: బాంబుల వర్షం కురిసింది ఇక్కడే