లాల్‌కృష్ణ అద్వానీ: 1989లోనే లోక్‌సభలోకి, రాజ్యసభలోనూ సేవలు

బీజేపీ విస్తరణలో కీలకంగా పనిచేసిన  అద్వానీ మాత్రం  1989లో లోక్ సభలో అడుగు పెట్టారు. అంతకు ముందు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

when Lal Krishna Advani  Elected first time to Loksabha ? lns

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించడంలో  లాల్ కృష్ణ అద్వానీ కీలక పాత్ర పోషించారు. అయితే  1989లోనే ఆయన తొలిసారిగా లో‌క్‌సభలో అడుగు పెట్టారు. అంతకు ముందు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

 విద్యార్ధిగా ఉన్న సమయంలోనే  రాష్ట్రీయ స్వయం సేవక్ లో  అద్వానీ చేరారు.ఆర్ఎస్ఎస్ లో చేరిన సమయంలోనే  ఆయన ఇంజనీరింగ్ విద్యకు కూడ స్వస్తి చెప్పారు. అద్వానీతో పాటు బీజేపీ చరిత్రలో కూడ  రథయాత్ర అత్యంత కీలకంగా మారింది.  రెండు స్థానాలున్న బీజేపీని 86 ఎంపీలు దక్కించుకోవడంలో  అద్వానీ రథయాత్ర కీలకంగా మారింది.  ఈ రథయాత్రతో  పలు రాష్ట్రాల్లో బీజేపీ విస్తరించింది. 

also read:ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్: రంగంలోకి నందిని, కాంగ్రెస్‌లో పోటాపోటీ

1986లో  అటల్ బిహారీ వాజ్ పేయ్  నుండి  అద్వానీ  బీజేపీ పగ్గాలను  అందుకున్నారు.  అప్పటినుండి పార్టీని బలోపేతం చేసేందుకు  అద్వానీ  చేసిన వ్యూహారచన ఆ పార్టీకి కలిసి వచ్చింది. 1970లో  తొలిసారిగా అద్వానీ  రాజ్యసభ సభ్యుడయ్యారు.  1989 వరకు  ఆయన రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగారు.  1980లో  ఆయన రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా కూడ కొనసాగారు.  1989లో  లోక్ సభలో  అద్వానీ లోక్‌సభలోకి అడుగుపెట్టారు.  1990 డిసెంబర్  24 నుండి  1991 మార్చి  13 వరకు తొలి దఫా ఆయన లోక్ సభలో విపక్షనేతగా పనిచేశారు.  1993 జూలై  21 నుండి  1996 మే 10వ తేదీ వరకు  రెండో దఫా  ఆయన  రెండో దఫా లోక్ సభలో విపక్షనేతగా పనిచేశారు.

also read:రెండు స్థానాల నుండి అధికారం వరకు: బీజేపీ విస్తరణలో అద్వానీదే కీలకపాత్ర

వాజ్ పేయ్ మంత్రివర్గంలో  అద్వానీ  ఉప ప్రధానిగా కూడ పనిచేశారు. రెండు స్థానాల నుండి దేశాన్ని పాలించే స్థాయికి పార్టీని విస్తరించడంలో అద్వానీ కీలకంగా పనిచేశారు. రథయాత్ర ద్వారా బీజేపీని దేశంలోని నలుమూలాల విస్తరించడంలో  అద్వానీ కీలకంగా వ్యవహరించారు.  1989లోనే అద్వానీ లోక్ సభలో అడుగు పెట్టారు. అయితే అంతకు ముందు ఆయన రాజ్యసభ సభ్యుడిగా  కొనసాగారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios