ఇజ్రాయెల్ పోలీసులు యేటా కేరళకు ఎందుకు వస్తారు?

Why Israel Police visits Kerala every year
Highlights

ఇజ్రాయెల్ పోలీసులు యేటా కేరళలోని కన్నూరుకు వస్తుంటారు. వారు ఎందుకు వస్తారనే విషయం చాలా మందికి తెలియదు. ఇజ్రాయెల్ పోలీసులు యూనిఫారాలను మార్యన్ అప్పారెల్ కుడుతుంది.

కన్నూరు: ఇజ్రాయెల్ పోలీసులు యేటా కేరళలోని కన్నూరుకు వస్తుంటారు. వారు ఎందుకు వస్తారనే విషయం చాలా మందికి తెలియదు. మూడేళ్ల క్రితం మార్యన్ అప్పారెల్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఇజ్రాయెల్ పోలీసులు కన్నేశారు. 

ఇజ్రాయెల్ పోలీసులు యూనిఫారాలను మార్యన్ అప్పారెల్ కుడుతుంది. ఈ కంపెనీలో 700 మందికి పైగా పనిచేస్తుంటారు. దుస్తులు కుట్టడానికి అనుసరించే పద్ధతులు చాలా కఠినంగా ఉంటాయి. యూనిఫారం నమూనాలను తయారు చేయాలని ఇజ్రాయెల్ పోలీసులు తొలుత సూచిస్తారు. నమూనా నచ్చిన తర్వాత వారు అంగీకరిస్తే యూనిఫారాల తయారీ జరుగుతుంది.

                           "                                                                             

లక్షకు పైగా యూనిఫారాలు కుట్టి విదేశాలకు పంపిస్తారు. యూనిఫారాల తయారీ ఆర్డర్ ఇజ్రాయెల్ నుంచి ఏడాదికి రెండుసార్లు వస్తుంది. యూనిఫారాలను ఇస్త్రీ చేసి బాక్సుల్లో ప్యాక్ చేస్తారు. 

ఇద్దరు ఇజ్రాయెల్ పోలీసులు వచ్చి దుస్తులను తనిఖీ చేస్తారు. సరిగా కుట్టకపోయినా, అతుకులు వేసినా వాటిని తీసేస్తారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మొత్తం 700 మంది కార్మికుల్లో 650 మంది మహిళలే.

loader