అయోధ్యలో రామ మందిరంలోని గర్భగుడిలో  రామ్ లల్లా  విగ్రహన్ని  నిన్న ప్రతిష్టించారు.ఈ విగ్రహనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం గర్బగుడిలో రామ్ లల్లా విగ్రహన్ని ఈ నెల 19వ తేదీన ప్రతిష్టించారు.

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల 22న ఏర్పాటు చేసింది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్.

అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహన్ని ప్రతిష్టించారు. రామ్ లల్లా అంటే బాల రాముడు అని అర్ధం. బాల రాముడిని రామ్ లల్లాగా పిలుస్తారు.

రామ్ లల్లా విగ్రహం 51 ఇంచులే ఎందుకు?

రామాలయంలో ప్రతిష్టించిన బాల రాముడి విగ్రహం 51 ఇంచుల ఎత్తులో ఉంది. అయితే రాముడి విగ్రహం 51 ఇంచుల ఎత్తు ఉండడానికి కూడ ఒక కారణం చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఐదేళ్ల పిల్లలు కనీసం 43 నుండి 45 ఇంచుల ఎత్తు ఉంటారు. అయితే రామాయణ కాలంలో మనుషులు చాలా పొడవుగా ఉండేవారని చెబుతారు. దీంతో బాల రాముడి విగ్రహన్ని 51 ఇంచులుగా రూపొందించారు. ఈ కారణంగానే రామ్ లల్లా విగ్రహం 51 ఇంచుల ఎత్తులో తయారు చేశారు. 

also read:అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట: వీవీఐపీల తాకిడి, విమానాలకు పార్కింగ్ సమస్య?

అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా శాస్త్రోక్త కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22న ఈ కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. ఈ నెల 23 వ తేదీ నుండి సాధారణ భక్తులకు రాముడిని దర్శనం చేసుకొనే అవకాశం ఉంటుంది. ఈ నెల 22న సాధారణ భక్తులకు అవకాశం ఉండదు.

also read:అయోధ్య రామ మందిరం: ప్రాణ ప్రతిష్ట అంటే ఏమిటీ?

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని సుమారు ఏడు వేల మంది ఎంపిక చేసిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. దీంతో అయోధ్యకు ఈ నెల 22న వీఐపీ, వీవీఐపీల తాకిడి పెరగనుంది.