Prophet Muhammad Controversy: మహ్మద్ ప్రవక్త వివాదంలో రోజురోజుకు ముదురుతోంది. ఇస్లామిక్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ నేపథ్యంలో డచ్ ఎంపీ గెర్ట్ వైల్డర్స్ బీజేపీ నేత నూపుర్ శర్మకు మద్దతుగా నిలిచారు. ఆమె తప్పుగా ఏమీ చెప్పలేదని అన్నారు.
Prophet Muhammad Controversy: మహ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆ వ్యాఖ్యలపై వివాదం చెలారేగుతోంది. తొలుత ఇస్లామిక్ దేశాలు.. అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనంతరం బీజేపీ వ్యాఖ్యలకు నిరసనగా కువైట్, ఖతార్, ఇరాన్ దేశాలు భారత రాయబారులకు సమన్లు జారీ చేశాయి. ఆ తర్వాత ఇదే బాటలో సౌదీ అరేబియా, యూఏఈ, ఇండోనేసియా తదితర ఇస్లామిక్ దేశాలు చేరాయి. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అలాగే.. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించాయి.
మన పొరుగు దేశాలైన ఇండోనేసియా, మాల్దీవులు సైతం నిరసన వ్యక్తం చేశాయి. బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించాయి.భారత ప్రభుత్వం, బీజేపీ తీసుకున్న చర్యలను స్వాగతించాయి. బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ప్రెసిడెంట్ ఇబ్రహీం సోలీ ఖండించాలని.. మాల్దీవుల పార్లమెంట్‌లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రతిపక్ష ఎంపీ అహ్మద్ షరీఫ్ ప్రయత్నించగా.. ఆ తీర్మానాన్ని పార్లమెంట్ తిరస్కరించింది.
ఇదిలా ఉంటే.. Prophet Muhammad Controversy బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు సపోర్టుగా.. నెదర్లాండ్స్ ఎంపీ Dutch Lawmaker గెర్ట్ వైల్డర్స్ నిలిచారు. ఆమెకు బహిరంగంగా మద్దతు ఇచ్చారు. ప్రవక్త గురించి భారత నాయకురాలు నూపుర్ శర్మ నిజాలు చెప్పడంపై అరబ్, ఇస్లామిక్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేయడం చాలా హాస్యాస్పదమని Dutch Lawmaker గిర్ట్ వైల్డర్స్ అన్నారు. భారత్ ఎందుకు క్షమాపణలు చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నూపుర్ శర్మను రక్షించుకోవాలని భారతీయులకు సూచించాడు.
నెదర్లాండ్స్ ఎంపీ గిర్ట్ వైల్డర్స్ ఏం చెప్పారంటే?
నెదర్లాండ్స్ ఎంపీ (Dutch Lawmaker) గిర్ట్ వైల్డర్స్ ట్వీట్ చేస్తూ.. క్షమపణ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయం మరింత దిగజార్చుతుంది. అందుకే నా స్నేహితులారా, మీరు ముస్లిం దేశాల బెదిరింపులకు గురికావద్దు. స్వేచ్ఛ కోసం నిలబడండి. ప్రవక్త గురించి నిజం మాట్లాడిన మీ నాయకుడు నూపుర్ శర్మను సమర్థించండి. గర్వించండి. నూపూర్ శర్మ .. మహమ్మద్ గురించి నిజం మాట్లాడారు అని పోస్టు చేశారు.
ఈ ట్వీట్ తర్వాత..Dutch Lawmaker గిర్ట్ వైల్డర్స్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ నుంచి టర్కీకి నాకు బెదిరింపులు వస్తున్నాయని, అయితే ఈ బెదిరింపు వల్ల ఏమీ సాధించలేమన్నారు. నేను నిజం చెప్పడం ఆపననీ స్పష్టం చేశారు.
