Asianet News TeluguAsianet News Telugu

Chandrayaan3: ‘దక్షిణ ధ్రువాన్ని ఎందుకు ఎంచుకున్నామంటే’.. చంద్రయాన్3 ప్రధాన లక్ష్యాన్ని వెల్లడించిన ఇస్రో చీఫ్

చంద్రయాన్ 3 ల్యాండింగ్ కోసం దక్షిణ ధ్రువాన్నే ఎందుకు ఎంచుకున్నారు? చంద్రయాన్ 3 లక్ష్యాలేమిటీ? వంటి ప్రశ్నలకు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ సమాధానం ఇచ్చారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై నీరు, ఖనిజాల నిక్షేపాలు అధికంగా ఉన్నాయని, అందుకే దక్షిణ ధ్రువాన్ని ఎంచుకున్నట్టు చెప్పారు.
 

why chandrayaan 3 landing site choosen south pole.. here isro chief s somanath answers kms
Author
First Published Aug 24, 2023, 3:08 PM IST

న్యూఢిల్లీ: చంద్రయాన్ 3 విజయవంతంగా సేఫ్‌గా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయిన సంగతి తెలిసిందే. చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్పేస్ క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. ఈ మిషన్ సక్సెస్ అయింది.. కానీ, ఇందుకు సంబంధించి చాలా ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. ఉదాహరణకు.. చంద్రయాన్ 3 ద్వారా ఇస్రో సాధించాలనుకుంటున్న లక్ష్యాలేమిటీ? దక్షిణ ధ్రువాన్నే ఇస్రో ఎందుకు ఎంచుకుంది? వంటి ప్రశ్నలు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ సమాధానాలు వెల్లడించారు.

ఎన్డీటీవీతో ఆయన మాట్లాడుతూ.. చంద్రయాన్ 2 దారుణంగా క్రాష్ అయిందని, తాము దాని నుంచి ఏమీ రికవరీ చేసుకోలేకపోయామని ఎస్ సోమనాథ్ వివరించారు. చంద్రయాన్ 3 పూర్తిగా మళ్లీ కొత్త మిషన్‌గా ప్రారంభించామని తెలిపారు. నాలుగేళ్లు తాము పూర్తిగా చంద్రయాన్ 3 ప్రాజెక్టుపైనే కేంద్రీకరించామని చెప్పారు. ‘మొదటి సంవత్సరం చంద్రయాన్ 2లో జరిగిన తప్పిదాలేమిటీ అని వెతకడానికే కేటాయించాం. రెండో ఏడాది ఆ లోపాలను, తప్పిదాలను సరిచేయడానికి పని చేశాం. ఇక చివరి రెండు సంవత్సరాలు వందల టెస్టులు చేశాం. కొత్త కొత్త మాడల్స్‌ను ప్రయోగించాం. చాలా రీతుల్లో పరీక్షలు జరిపాం’ అని వివరించారు.

‘కరోనా కాలంలో మా ప్రోగ్రామ్‌లకు ఇబ్బంది కలిగింది. కానీ, తాము ఆ సమయంలో కూడా కొన్ని రాకెట్లు ప్రయోగించాం. కోవిడ్ తర్వాత మేం మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాం’ అని చెప్పారు. ఇక దక్షిణ ధ్రువాన్నే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు. చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడిపై వాటర్ ఐస్‌కు సంబంధించిన సమాచారాన్ని పెంచుకోవచ్చని  తెలిపారు. చంద్రుడిపై మనకు లభించే విలువైన వనరుల్లో ఇది ఒకటి.

Also Read: మీరు డబ్బులు పెట్టి వెళ్లారు .. మేం ఆల్రెడీ చంద్రుడి మీదే ఉన్నాం: పాకిస్తాన్ యువకుడి ఫన్నీ కామెంట్స్ (Video)

‘చంద్రయాన్ 3 ఇన్‌స్ట్రుమెంటేషన్ మొత్తం చంద్రుడి దక్షిణ ధ్రువం లేదా దానికి సమీపంలో ల్యాండింగ్‌ కోసం సిద్ధం చేసిందే. ఎందుకంటే దక్షిణ ధ్రువం వద్ద పెద్ద మొత్తంలో శాస్త్రీయ విషయాలు తెలుసుకునే అవకాశం ఉన్నది. నీరు, ఇతర ఖనిజాలు, లవణాలు ఎక్కువగా ఈ దక్షిణ ధ్రువం వద్దే నిల్వ ఉన్నాయి’ అని సోమనాథ్ వివరించారు. 

‘ఈ ప్రయోగాలకు తోడు అనేక మంది శాస్త్రవేత్తలు కొన్ని ఫిజికల్ ప్రాసెస్‌కు సంబంధించిన వివరాలనూ తెలుసుకోవాలనుకుంటున్నారు. చంద్రుడి పుట్టుక, ఏర్పాటు, అక్కడి పరిస్థితుల గురించి తెలుసుకునే అవకాశం కూడా చంద్రయాన్ 3 దక్కే అవకాశం ఉన్నది. వీటి గురించి అన్వేషించడానికి చంద్రయాన్ 3 సమర్థవంతమైనది’ అని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios