బిచ్చగాడిగా జీవితం...20 ఏళ్లలో 40 మర్డర్లు: ఎవరీ మున్నా భజరంగీ..?

who is munna bajrangi
Highlights

ఉత్తరప్రదేశ్‌లో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ మున్నా భజరంగీని భాగ్‌పట్‌లోని జైల్లో హత్య కావడం ఆ రాష్ట్రంలో కలకలం రేపింది.దీంతో అతని గురించి గూగుల్‌లో వెతకాడం ప్రారంభించారు నెటిజన్లు.. ఆ పరిశోధనలో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. 

ఉత్తరప్రదేశ్‌లో కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ మున్నా భజరంగీని భాగ్‌పట్‌లోని జైల్లో హత్య కావడం ఆ రాష్ట్రంలో కలకలం రేపింది.. జైల్లోని ఓ ఖైదీ ఇవాళ తెల్లవారుజామున భజరంగీపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. దీంతో అతని గురించి గూగుల్‌లో వెతకాడం ప్రారంభించారు నెటిజన్లు.. ఆ పరిశోధనలో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. అవేంటో మనం కూడా ఒకసారి చూస్తే..

* 1967లో ఉత్తరప్రదేశ్‌ పూర్వాంచల్‌లో మున్నా భజరంగీ జననం... అతని అసలు పేరు ప్రేమ్ ప్రకాశ్ సింగ్

* ఐదో తరగతి వరకు విద్యాభ్యాసం.. బిచ్చగాడిగా జీవితం ప్రారంభం

* అక్రమాయుధాల కేసులో 17 ఏళ్ల వయసులో తొలిసారి జైలుకి.

* విడుదల తర్వాత గజ‌రాజ్‌సింగ్ గ్యాంగ్‌లో చేరి.. 1984లో బీజేపీ ఎమ్మెల్యే రామ్‌చంద్ర సింగ్ హత్య.

* కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ ముక్తర్ అన్సారి గ్యాంగ్‌లో చేరిక... అనతికాలంలో అన్సారి రైట్ హ్యాండ్.

* 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్‌రామ్‌ దారుణ హత్యతో పాపులారిటీ.. ఎమ్మెల్యే శరీరంపై ఏకే47 రైఫిల్లతో కాల్పులు.. కృష్ణానంద్ డెడ్‌బాడీలో 400 బుల్లెట్లు.

* 2009లో అరెస్ట్

* 20 ఏళ్ల కాలంలో 40 హత్య కేసులు, కిడ్నాప్‌లు, బలవంతపు వసూళ్లు.

* 2012లో జైలు నుంచే ఎమ్మెల్యేగా పోటీ.. ఓటమి
 

loader