Asianet News TeluguAsianet News Telugu

రోడ్డు పనులు చేస్తుంటే.. లంకె బిందె దొరికింది

రోడ్డు నిర్మాణ సమయం ఓ మహిళా కూలీ ఈ కుండను గమనించి తోటి వారికి చెప్పగా విషయం గ్రామస్థులకు చేరిందని సర్పంచి తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ నాణేలు 12 లేదా 13వ దశాబ్దం నాటివని తెలుస్తోందని కలెక్టర్‌ వెల్లడించారు. 

While Digging Earth, Labourer Finds Pot Of 900-Year-Old Gold Coins

రోడ్డు పనులు చేస్తున్న ఓ కూలీకి లంకె బిందె దొరికి న సంఘటన ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఆ లంకె బిందెలో 900ఏళ్ల నాటి బంగారు నాణేలు బయటపడ్డాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని కొండగావ్‌ జిల్లాలో కోర్‌కోటి, బెద్మా అనే రెండు గ్రామాల మధ్య రోడ్డు నిర్మాణం కోసం తవ్వగా పురాతనం కాలం నాటి కుండ బయటపడింది. అందులో 57 బంగారు నాణేలు, ఓ వెండి నాణెం, బంగారపు చెవిదిద్దు ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ నీల్‌కేతన్‌ వెల్లడించారు. జులై 10వ తేదీన అవి బయటపడగా కోర్‌కోటి సర్పంచి నెహ్రూలాల్ బాగెల్‌ ఈరోజు వాటిని కలెక్టర్‌కు అప్పగించారు.

రోడ్డు నిర్మాణ సమయం ఓ మహిళా కూలీ ఈ కుండను గమనించి తోటి వారికి చెప్పగా విషయం గ్రామస్థులకు చేరిందని సర్పంచి తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆ నాణేలు 12 లేదా 13వ దశాబ్దం నాటివని తెలుస్తోందని కలెక్టర్‌ వెల్లడించారు. నాణేలపై ఉన్న గుర్తులను గమనిస్తే అవి పూర్వం విదర్భ ప్రాంతాన్ని పరిపాలించిన యాదవుల కాలంలోనివిగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ ప్రాంతంలోని ఏడు జిల్లాలను కూడా అప్పట్లో యాదవుల పాలనలోనే ఉండేవని చెప్తున్నారు. రాష్ట్ర పురావస్తు శాఖ అధికారుల నాణేలను పూర్తిగా పరిశీలిస్తారని కలెక్టర్‌ తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios