కర్ణాటకలో మెజార్టీ సీట్లు రాబట్టుకునే వైపుగా దూసుకెళ్లుతున్న కాంగ్రెస్.. అదే సందర్భంలో మరో ఆలోచనలో కూడా చేస్తున్నది. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ఆలోచనలో భాగంగా వారిని తమిళనాడుకు తరలించాలని ప్రణాళికలు చేస్తున్నది. ఈ రోజు సాయంత్రం వ
న్యూఢిల్లీ: కర్ణాటకలో అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ వెళ్లుతున్నది. మెజార్టీ సీట్లలో కాంగ్రెస్ పార్టీనే ముందంజలో ఉన్నది. బీజేపీతోపాటు జేడీఎస్ కూడా సీట్లను కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. అధికారం హస్తగతమే అనే విశ్వాసం వారిలో కలుగుతున్నది. ఈ తరుణంలో పార్టీ నేతలు, కార్యకర్తలు వేడుక చేసుకుంటూ ఉండగా మరో వైపు తమ ఎమ్మెల్యేలను పొరుగు రాష్ట్రం కర్ణాటకకు తరలించాలని కాంగ్రెస్ యోచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. పలు రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ లోటస్’ (ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ తమ పార్టీలోకి చేర్చుకుంటుందని, దాన్ని ప్రత్యర్థి పార్టీలు ఆపరేషన్ లోటస్ అని పిలుస్తుంటాయి.) సక్సెస్ అయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ స్వతహాగా మెజార్టీ సీట్లు సాధించే దిశగా వెళ్లుతున్నది. మెజార్టీ మార్క్ సమీపంలోనే ఎమ్మెల్యేల సంఖ్య ఆగిపోతే... వారిని కాపాడుకోవాలనే ఆలోచనలూ మరో వైపు చేస్తున్నది. 224 అసెంబ్లీ స్థానాలు గల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 110 నుంచి 115 సీట్ల వరకు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. మెజార్టీ మార్క్ కంటే మరీ ఎక్కవ సీట్లు వచ్చే అవకాశాలు లేని సందర్భంలో వారిని తమిళనాడుకు పంపించాలని ప్లాన్ వేస్తున్నది. ఇప్పటికే తమిళనాడులోని అధికార డీఎంకేతో ఈ మేరకు సంప్రదింపులు జరిపినట్టు కాంగ్రెస్ వర్గాలు వివరించాయి. గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈ రోజు సాయంత్రంలోగా బెంగళూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అటు నుంచి తమిళనాడుకు పంపించే యోచనలో ఉన్నారు. ఇప్పటికే తమిళనాడులో ఎమ్మెల్యేలు బస చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపాయి.
Also Read: కర్ణాటక ఫలితాల ట్రెండ్ తో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్.. ఢిల్లీ ఆఫీసులో ‘బజరంగ్ బలి’ నినాదాలు..
కాంగ్రెస్ 120 స్థానాలు గెలుచుకుంటుందని కర్ణాటక మాజీ సీఎం సిద్దారామయ్య తెలిపారు. మళ్లీ సీఎం రేసులో ఉన్న ఆయన మాట్లాడుతూ, అవినీతి, ప్రభుత్వ వ్యతిరేకతే ప్రజల్లో ఉన్న నిజమైన ఇష్యూలు అని, వారు మార్పు కావాలని కాంక్షించారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు వైపుగా దూసుకెళ్లుతున్న తరుణంలో ఈ విజయానికి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కూడా ఉపకరించిందని పార్టీ నేతలు చెబుతున్నారు. పలువురు సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర ప్రజల్లో ఉత్సాహాన్ని నింపిందని, అదే బీజేపీ ప్రభుత్వాన్ని దెబ్బ తీసిందని విశ్లేషిస్తున్నారు.
ఫలితాలు ముగిసిన తర్వాత సీఎం అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా గట్టి పోటీ ఏర్పడనుంది. ఇప్ప టికే సీఎం రేసులో అటు సిద్దారామయ్య, ఇటు డీకే శివకుమార్‌లు పోటాపోటీగా ఉన్నారు. పలుమార్లు ఆ ఇద్దరు నేతలూ తాము సీఎం కావాలనే ఆకాంక్షను వెల్లడించారు.
