పలు పంటల కనీస మద్దతు ధరలను పెంచుతూ కేంద్రం బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.  గోధుమలు సహా పలు పంటలపై కనీస మద్దతు ధరను పెంచింది కేంద్రం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ ఏడాదికి సంబంధించి కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.


న్యూఢిల్లీ:పలు పంటల మద్దతు ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బుధవారంనాడు ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సాగుతున్న ఉద్యమం సమయంలో కేంద్రం తీసుకొన్న ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ ఏడాదిలో రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయనున్న గోధుమ మద్దతు ధరను 2 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 

ఈ ఏడాది క్వింటాల్‌ గోధుమ కనీస మద్దతు ధరను 2,015 రూపాయలుగా నిర్ణయించింది కేంద్రం. ప్రపంచంలో గోధుమ వినియోగంలో భారత్‌ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఏటా మద్దతు ధరను నిర్ణయిస్తుంది.. రైతులను ఆదుకునే ప్రయత్నం చేస్తుంటుంది. 

ఈ ఏడాదికి గాను ఆవాల మద్దతు ధరను కేంద్రం 400 రూపాయలు పెంచింది కేంద్రం. దీంతో క్వింటాల్‌ ఆవాలు ధర 5,050 రూపాయలుగా ప్రకటించింది. ప్రస్తుతానికి ఖరీఫ్‌, రబీ రెండు సీజన్‌లకు సంబంధించి ప్రభుత్వం 23 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ ఏడాదికి సంబంధించి కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.