Asianet News TeluguAsianet News Telugu

గేదెలు, ఎద్దులను వధిస్తుండగా.. ఆవులను వధిస్తే తప్పేంటీ?: కర్ణాటక మంత్రి కే వెంకటేశ్

కర్ణాటక మంత్రి కే వెంకటేశ్ గోవధ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గేదెలను, ఎద్దులను వధించినప్పుడు గోవులను వధిస్తే తప్పేంటీ అంటూ ప్రశ్నించారు. 
 

what wrong in slaughtering cow says karnataka minister k venkatesh kms
Author
First Published Jun 4, 2023, 7:03 PM IST

బెంగళూరు: కర్ణాటక పశుసంవర్ధక, వెటెరినరీ సైన్సెస్ మంత్రి కే వెంకటేశ్ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. వయసు పెరిగిన పశువులను మెయింటెయిన్ చేయడం, చనిపోయాక వాటిని డిస్పోజ్ చేయడం రైతులకు పెద్ద సమస్యగా పరిణమించిందని అన్నారు. గేదెలు, ఎద్దులను వధించినప్పుడు గోవును వధిస్తే తప్పేంటీ? అంటూ ఆయన ప్రశ్నించారు.

గోవధ నిషేధ బిల్లుకు సవరణ అవసరమని, రైతు ప్రయోజనాల దృష్ట్యా ఈ సవరణ అవసరం అని మంత్రి కే వెంకటేశ్ తెలిపారు. కర్ణాటక గోవధ నివారణ, క్యాటిల్ ప్రిజర్వేషన్ బిల్లు 2020 అమలు చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం దీర్ఘాలోచనలు చేస్తున్నది. ఈ బిల్లును 2021లో అప్పటి బీజేపీ ప్రభుత్వం పాస్ చేసింది. ఈ బిల్లును ఇప్పుడు అమలు చేయాల్సి ఉన్నది.

Also Read: జ్ఞాన వాపి కేసు నుంచి హిందూ పిటిషనర్ ఉపసంహరణ.. ‘హిందువులూ వేధిస్తున్నారు’

గోవధ నిషేధ బిల్లు అంటే ఏమిటీ?

రాష్ట్రంలో గోవధలపై సంపూర్ణ నిషేధాన్ని ఈ బిల్లు ఆదేశిస్తున్నది. పశులు అక్రమ రవాణా, గోవులపై అరాచకలను, వధించడం చేస్తే కఠిన శిక్ష విధించాలని పేర్కొంటున్నది. ఈ ఆర్డినెన్స్ ప్రకారం గోవధ చేస్తే మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు జరిమానా పడుతుంది. 

2020 డిసెంబర్‌లో అప్పటి బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ వాకౌట్ చేసి నిరసనలు చేసింది. తాజాగా, అదే కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది.

Follow Us:
Download App:
  • android
  • ios