జమ్మూ సీఎం ముఫ్తీ రాజీనామా: ఏం జరగనుంది?

What may happen next in Jammu and Kashmir
Highlights

జమ్మూలో సీఎం పదవికి ముఫ్తీ రాజీనామా తర్వాత పరిణామాలు


శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌ సీఎం పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేశారు.  బిజెపి మద్దతును ఉప సంహరించడంతో మెహబూబా ముఫ్తీ గవర్నర్‌కు రాజీనామా లేఖను ఇచ్చారు.  అయితే  రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి డిమాండ్ చేసింది. జమ్మూలో మరో ప్రధాన పార్టీ నేషనల్ కాన్పరెన్స్ కూడ రాష్ట్రపతి  పాలన విధించాలనే డిమాండ్ ను సమర్ధించింది.  పీడీపీ, నేషనల్ కాన్పరెన్స్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్య బలం కూడ ఉంది. కానీ, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడ రాష్ట్రపతి పాలననే కోరుకొన్నారు.

ప్రస్తుతం కాశ్మీర్ అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలున్నారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలను నామినేట్ చేసింది. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు 87 మంది మాత్రమే. 2014లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి కూడ స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో బిజెపితో కలిపి పీడీపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గత ఎన్నికల్లో పీడీపీకి 28 సీట్లు వచ్చాయి.  బిజెపికి 25 సీట్లు దక్కాయి.

గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించిన నేషనల్ కాన్ఫరెన్స్ కు కేవలం 15 స్థానాలు మాత్రమే దక్కాయి.  కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.  ఐదుగురు స్వతంత్రులు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. సీపీఎం నుండి యూసుఫ్ తరిగామి విజయం సాధించారు.  జెకె పిడిఎప్ నుండి ఒక్కరు విజయం సాధించారు. ప్రభుత్వం ఇద్దరిని నామినేట్ చేసింది.


జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని కాల్పుల విరమణను కేంద్రం విధించింది. అయితే దీన్ని ఆసరగా చేసుకొని పాక్ దాడులకు పాల్పడుతోంది. అయితే  రంజాన్ ముగిసినందున  కాల్పుల విరమణను పొడిగించాలని పీడీపీ డిమాండ్ చేస్తోంది. పీడీపీ డిమాండ్‌ను కేంద్రం సమర్ధించలేదు. కాల్పుల విరమణను పొడిగించే సమస్యే లేదని ఆ పార్టీ తేల్చి చెప్పింది. 

దీంతో  ఇవాళ బిజెపి ఎమ్మెల్యేలను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీకి రప్పించుకొన్నారు. ఆ తర్వాత వారితో చర్చించారు. పీడీపీ ప్రభుత్వానకి మద్దతును ఉపసంహరించుకొంటున్నట్టు బిజెపి ప్రకటించింది. ఈ ప్రకటనతో పీడీపీ ప్రభుత్వం మైనార్టీలో పడింది. దీంతో సీఎం పదవికి ఆమె రాజీనామా చేసింది.

నేషనల్ కాన్పరెన్స్ , పీడీపీలకు మరోక్క ఎమ్మెల్యే కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజారిటీ సరిపోతోంది. కానీ, నేషనల్ కాన్పరెన్స్ మాత్రం  ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోమని ప్రకటించింది.


 కాంగ్రెస్, పీపుల్స్ కాన్ఫరెన్స్, స్వతంత్రులతో చేతులు కలపడం. 28 మంది ఎమ్మెల్యేలున్న పీడీపీ, 12 మంది ఎమ్మెలున్న కాంగ్ర్రెస్‌తో చేతులు కలిపితే... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరో నలుగురు ఎమ్మెల్యేల సంఖ్యాబలం అవసరమవుతుంది. సజాద్ లోన్ నాయకత్వంలోని పీపుల్స్ కాన్ఫరెన్స్ చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో ఇద్దరు స్వతంత్రుల మద్దతు కూడగట్టుకోగలిగితే  పీడీపీ, కాంగ్రెస్ పార్టీలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే  ఈ  కూటమి ఏర్పాటుపై  పార్టీలు ఏ మేరకు ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయనేది ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే రెండు ప్రధాన పార్టీలు రాష్ట్రపతి పాలన కోరుకొంటున్నాయి.  


 

loader