Asianet News TeluguAsianet News Telugu

కరుణానిధి వీల్‌చైర్ వెనుక ఉన్న కథ ఇదీ


చెన్నై: డీఎంకె చీఫ్ కరుణానిధికి నల్ల కళ్లజోళ్లతో ఎలా విడదీయరాని బంధం ఉందో.... చక్రాల కుర్చీతో కూడ  అంతే బంధం ఉంది. ఆసుపత్రిలో చేరాల్సి వస్తోందని భావించి వెన్నునొప్పిని నిర్లక్ష్యం చేయడంతో  కరుణానిధి చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి

what is the reason behind Karunanidhi using wheelchair

చెన్నై: డీఎంకె చీఫ్ కరుణానిధికి నల్ల కళ్లజోళ్లతో ఎలా విడదీయరాని బంధం ఉందో.... చక్రాల కుర్చీతో కూడ  అంతే బంధం ఉంది. ఆసుపత్రిలో చేరాల్సి వస్తోందని భావించి వెన్నునొప్పిని నిర్లక్ష్యం చేయడంతో  కరుణానిధి చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.చక్రాల కుర్చీకే పరిమితమైన  ఆసుపత్రి నుండే ఆయన పాలనను సాగించారు. 


2008 డిసెంబర్  మాసంలో కరుణానిధికి వెన్నునొప్పి ప్రారంభమైంది. ఈ విషయాన్ని  కుటుంబసభ్యులకు చెబితే ఆసుపత్రిలో చేర్చుతారని  భావించాడు.  ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా ఈ నొప్పిని అలాగే భరించాడు. అయితే  ఒకరోజున  కరుణానిధి తన కుటుంబ వైద్యుడు గోపాల్‌‌‌ను పిలిపించి తన వెన్నునొప్పి విషయాన్ని చెప్పాడు. 

కరుణ వెన్నునొప్పితో బాధపడుతున్న విషయాన్ని గ్రహించిన గోపాల్  ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ మయిల్‌వాగనన్‌ను పిలిపించారు. దీంతో కరుణకు తాత్కాలిక ఉపశమనం కల్గించేలా  మందులు, ఇంజక్షన్లు ఇచ్చారు.  దీంతో కరుణానిధి స్వాంతన చేకూరింది.

2009 జనవరి 25 వ తేదీన చెన్నైలోని నుంగంబాక్కంలోని వళ్లువర్‌కొట్టంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సుమారు పది గంటలకు పైగా కరుణానిధి కూర్చున్నారు. ఈ కార్యక్రమం ముగిసి ఇంటికి చేరుకొన్న కరుణానిధి వెన్నునొప్పిని భరించలేకపోయాడు. దీంతో మరోసారి డాక్టర్ మయిల్‌వాగనన్ సూచనల మేరకు  మరో వైద్యుడు డాక్టర్ ఎస్ఎస్ కె. మార్తాండం కరుణకు చికిత్స చేశారు. అంతేకాదు  ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. ఈ సూచన మేరకు రాత్రి 2 గంటలకు రామచంద్ర ఆసుపత్రిలో చేర్చారు.

వయోభారంతో పాటు శరీర బరువు కారణంగా వెన్నుపూసల్లో అరుగుదల ఏర్పడిందని వైద్యులు గుర్తించారు. మందులు, ఇంజక్షన్లతో చికిత్స చేసినా ఫలితం కన్పించలేదు.  దీంతో వెన్నెముకకకు కరుణానిధికి శస్త్రచికిత్స చేశారు. దీంతో అప్పటి నుండి ఆయన చక్రాల కుర్చీకే పరిమితం కావాల్సి వచ్చింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios