మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయంగా వాడుకుంటున్నారు: బీజేపీపై కనిమొళి ఫైర్
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం తీరుపై డీఎంకె ఎంపీ కనిమొళి విమర్శలు చేశారు. లోక్ సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె ఇవాళ పాల్గొన్నారు.
న్యూఢిల్లీ:మహిళా రిజర్వేషన్ బిల్లును రాజకీయంగా బీజేపీ తనకు అనుకూలంగా ఉపయోగించుకుంటుందని డీఎంకె ఎంపీ కనిమొళి విమర్శించారు.మహిళా రిజర్వేషన్ బిల్లుపై డీఎంకె ఎంపీ కనిమొళి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో బుధవారంనాడు చర్చను ప్రారంభించారు కాంగ్రెస్ నేత సోనియాగాంధీ. ఈ చర్చలో డీఎంకె తరపున ఆ పార్టీ ఎంపీ కనిమొళి చర్చలో పాల్గొన్నారు.మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని తాను పలుమార్లు ఇదే వేదికపై ప్రస్తావించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
ఈ బిల్లును ప్రవేశ పెట్టే ముందు అన్ని పార్టీలు ఏకాభిప్రాయం సాధించేలా చూడాలని తాను కోరిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం ఏకాభిప్రాయం కోసం ఏం చర్యలు తీసుకొందో చెప్పాలని ఆమె కోరారు.ఈ బిల్లుపై ఎలాంటి చర్చలు జరిగాయని ఆమె ప్రశ్నించారు. ఈ పార్లమెంట్ సమావేశాలను ఎందుకు గోప్యంగా ఉంచారని ఆమె కేంద్రాన్ని అడిగారు.
మహిళలకు సమానంగా గౌరవం ఇవ్వాలని ఆమె కోరారు. సెల్యూట్ చేసే పీఠంపై కూర్చోవాలని మహిళలు కోరుకోవడం లేదన్నారు. పీఠాలపై ఉంచడం, పూజించడం లేదా తల్లులు, సోదరీమణులు,భార్యలుగా పిలిపించుకోవడం కంటే సమానంగా గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నట్టుగా కనిమొళి చెప్పారు.పీఠాలపై దిగి సమంగా నడుద్దామన్నారు.ఈ దేశంపై మీకు ఉన్నంత హక్కు మాకూ కూడ ఉందన్నారు.ఈ దేశం మనది, ఈ పార్లమెంట్ మనది.. ఇక్కడ ఉండే హక్కు మాకూ ఉందని కనిమొళి చెప్పారు.