దొంగతనం అనుమానంతో ఇద్దరు మహిళలపై దాడి, అర్ధనగ్నంగా..! బెంగాల్‌లో దుర్ఘటన
పశ్చిమ బెంగాల్‌లో ఇద్దరు మహిళలను కొందరు మహిళలు దారుణంగా కొట్టారు. వారి బట్టలను చింపేశారు. అర్ధనగ్నంగా రోడ్డుపై కొడుతూ తీసుకెళ్లారు. నిమ్మకాయలు దొంగిలించారనే అనుమానంతో ఈ దాడికి పాల్పడినట్టు బాధిత మహిళ కూతురు తెలిపింది.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. దొంగతనం అనుమానంతో ఇద్దరు మహిళలపై తీవ్రంగా దాడి చేశారు. అర్ధనగ్నంగా రోడ్డుపై తింపుతూ కొట్టారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో మూడు నాలుగు రోజుల క్రితం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అంతేకాదు, దొంగతనం చేసినట్టు ఆరోపించిన ఆ మహిళలు జైలులోనే ఉన్నట్టు బాధితురాలి కూతురు చెప్పింది.
‘జులై 18వ తేదీన తన తల్లి, చిన్నమ్మ నిమ్మకాయలు అమ్మడానికి మార్కెట్ వెళ్లారు. అక్కడే ఓ స్వీట్ షాప్ ఉన్నది. ఆ స్వీట్ షాప్ ఓనర్ తమ తల్లి, చిన్నమ్మలు నిమ్మకాయలు దొంగిలించారని ఆరోపణలు చేశారు. ఆ స్వీట్ షాప్ ఓనర్ చేసిన ఆరోపణలతో అక్కడే ఉన్న కొందరు వారిని పట్టుకుని చావబాదారు. వారి బట్టలనూ విప్పారు. అర్ధనగ్నంగా రోడ్డుపై కొట్టుతూ తీసుకెళ్లారు. ఇది అన్యాయం. మాకు న్యాయం చేయండి’ అంటూ కూతురు ఆవేదనతో చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం తన తల్లి, చిన్నమ్మలు మాల్దా జైలులో ఉన్నారని వివరించింది.
Also Read: మిజోరం రాష్ట్రానికి మణిపూర్ సెగలు.. ‘మైతేయిలు వెళ్లిపోవాలి’.. భద్రత కల్పించిన ప్రభుత్వం
‘ప్రస్తుతం నా తల్లి, చిన్నమ్మ మాల్దా జైలులో ఉన్నారు. ఓ సివిక్ వాలంటీర్‌తో మాకు ఈ విషయం తెలిసింది. వారిని కలవడానికీ మేం వెళ్లాం. వారిని సోమవారం విడుదల చేస్తామని పోలీసులు చెప్పారు’ అని ఆమె చెప్పింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు మహిళలపై దాడి చేస్తూ అర్ధనగ్నంగా ఊరేగిస్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి.
ఈ ఘటన మూడు నాలుగు రోజుల కింద జరిగిందని తెలిసింది. మాల్దా జిల్లా లోని పకౌహాత్ లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఆ ఇద్దరు మహిళలపై ఇతర మహిళలు దాడి చేసినట్టు ఆ వీడియోలో కనిపించింది. అయితే, ఈ ఘటనకు సంబంధించి పశ్చిమ బెంగాల్‌కు ఏ ఫిర్యాదునూ ఇవ్వలేదని కొన్ని వర్గాలు వెల్లడించాయి.