వచ్చే నెల 8న బెంగాల్ పంచాయతీ ఎన్నికలు.. రేపటి నుంచి నామినేషన్లు
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికలు వచ్చే నెల 8వ తేదీన జరగనున్నాయి. ఇందుకు నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి 15వ తేదీ వరకు సాగనుంది. జులై 11న కౌంటింగ్ ఉంటుంది.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు అంటే ఉద్రిక్తతలు గుర్తుకు వస్తాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ఇందుకు పరాకాష్టగా నిలిచాయి. మళ్లీ ఇప్పుడు బెంగాల్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. వచ్చే నెల 8వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.
జులై 8వ తేదీన బెంగాల్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందుకు నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఈ నెల 15వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ సాగనుంది. జులై 11వ తేదీన ఈ కౌటింగ్ ఉండనుంది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మాజీ చీఫ్ సెక్రెటరీ రాజీవ సిన్హా తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియామకానికి లైన్ క్లియర్ అయింది. రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ తదుపరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా రాజీవ సిన్హా నియామకానికి ఆమోదం తెలిపినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.
Also Read: వయానాడ్‌లో ఉప ఎన్నికకు ఏర్పాట్లు! మాక్ పోలింగ్‌తో అన్ని కళ్లు అటువైపే.. బరిలోకి ప్రియాంక గాంధీ?
రాష్ట్రంలో పట్టణ, పురపాలక, పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనే నిర్వహిస్తుందని తెలిసిందే.