Asianet News TeluguAsianet News Telugu

భారీగా బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్.. వాటి విలువ తెలిస్తే తిమ్మతిరగాల్సిందే..? 

పశ్చిమ బెంగాల్‌లోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని బీఎస్ఎఫ్ భగ్నం చేసింది. రూ. 2.78 కోట్ల విలువైన 40 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుంది.

West Bengal Jawans Of ICP Petrapole Apprehended A Smuggler Along With 40 Biscuits Of Gold
Author
First Published Mar 19, 2023, 5:06 PM IST

అక్రమ బంగారాన్ని తరలించేందుకు అక్రమార్కులు ప్రతిసారీ కొత్త ఎత్తులు వేస్తుంటారు. ప్రధానంగా అక్రమ బంగారానికి అంతర్జాతీయ సరిహద్దులు రహదారులుగా మారుతున్నాయి. కొన్నిసార్లు పట్టుబడుతుంటే..ఎన్నోసార్లు అక్రమంగా తరలిపోతోంది. తాజాగా దక్షిణ బెంగాల్ ఫ్రాంటియర్ పరిధిలో ఊహించని రీతిలో 40 బంగారు బిస్కెట్లను బీఎస్ఎఫ్ జవాన్లు పట్టుకున్నారు. వాటి విలువ 2 కోట్లకు పై మాటే.. 

ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. భారత్‌లో అంతర్జాతీయ సరిహద్దుల గుండా బంగారం స్మగ్లింగ్ ఘటనలు ఎక్కువయ్యాయి. స్మగ్లర్లు విదేశాల నుంచి రహస్యంగా బంగారాన్ని తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇలాంటి స్మగ్లర్‌లను పలువురు ఎయిర్‌పోర్టులో భద్రతా బలగాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి.పశ్చిమ బెంగాల్‌లో ఐపీసీ పెట్రాపోల్ జవాన్లు శనివారం నాడు బంగారు బిస్కెట్లతో కూడిన ట్రక్కును పట్టుకున్నారు.

దక్షిణ బెంగాల్ సరిహద్దులోని ఐసిపి పెట్రాపోల్, 145 బెటాలియన్‌కు చెందిన జవాన్లు  శనివారం (మార్చి 18) సాయంత్రం 6.30 గంటలకు పశ్చిమ బెంగాల్‌లో అంతర్జాతీయ సరిహద్దు గుండా బంగారు స్మగ్లర్ యువకుడిని పట్టుకున్నారు. అధికారుల సమాచారం ప్రకారం.. స్మగ్లర్ ట్రక్కు డ్రైవర్‌గా నటిస్తున్నాడు. 4667 గ్రాముల బరువున్న ఈ ట్రక్కులో మొత్తం 40 బిస్కెట్లు ఉన్నాయి. ఈ బిస్కెట్ల మొత్తం ఖరీదు రెండు కోట్ల రూపాయలు. డ్రైవర్‌ను పట్టుకున్న జవాన్లు ట్రక్కును స్వాధీనం చేసుకున్నారు.

డైపర్ లో బంగారం 

కర్నాటక లోని మంగళూరు ​ఎయిర్​ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్నిఅధికారులు పట్టుకున్నారు. ఇంటలిజ్సెన్ సమాచారం ప్రకారం.. మంగళూరులో అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో సోదాలు నిర్వహించిన అధికారులు షాక్ గురయ్యారు. ఇంటర్నేషనల్​ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడు తన 22 నెలల కుమార్తె డైపర్‌లో బంగారాన్ని తరలిస్తూ అధికారులకు పట్టుబడ్డాడు. బంగారాన్ని పేస్టు రూపంలోకి మార్చి.. లోపల పౌచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో దాచి అక్రమంగా తీసుకొచ్చాడు.   కస్టమ్స్​అధికారులు తనిఖీలు నిర్వహించి.. బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అంతకుముందు మరో ఇద్దరు ప్రయాణికుడు కూడా ఇలాగే  పట్టుబడ్డారు.ఒక ప్రయాణికుడు బంగారాన్ని పేస్ట్ లా మార్చి తన నడుముకు బెల్టుగా కట్టుకుని తరలిస్తుండగా పట్టుపడ్డారు. మరో వ్యక్తి ప్రవేట్ పార్ట్ లో   బంగారాన్ని ఉంచి తీసుకెళుతుండగా అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు ఈ ముగ్గరు ప్రయాణికులను  అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 1 నుంచి 15వ తేదీల మధ్యలో మంగళూరు విమానాశ్రయంలో రూ.90.67 లక్షల విలువైన 1606 గ్రాముల బంగారాన్ని జప్తు చేసినట్లు కస్టమ్స్‌ అధికారులు శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios