వడగాలుల కారణంగా బెంగాల్‌లో 24వ తేదీ వరకు స్కూల్స్, కాలేజీలు బంద్

వడగాలుల కారణంగా పశ్చిమ బెంగాల్‌లో పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు వారంపాటు మూసేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏప్రిల్ 17వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు మూసేయాలని తెలిపింది.
 

west bengal issued orders to remain close all schools and colleges in the state till april 24 kms

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వడగాలులను దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ, ఉన్నత విద్యా శాఖలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.  ఒక వారం రోజుల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసేయాలని ఆదేశాలు జారీ చేశాయి. ఏప్రిల్ 24వ తేదీ వరకు వీటిని మూసేయాలని సూచించాయి. ఏప్రిల్ 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు వారం పాటు స్కూల్స్ బంద్ ఉంటాయి. డార్జీలింగ్, కాలింపోంగ్ జిల్లాలు మినహా రాష్ట్రంలోని అన్ని స్కూల్స్ మూసేయాలని ఆదేశాలు వచ్చాయి. ఈ రెండు జిల్లాలు హిల్లీ స్టేషన్ కాబట్టి, అక్కడ మినహాయింపు ఇచ్చింది.

పశ్చిమ బెంగాల్ ఉన్నత విద్యా శాఖ కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేశాయి. అన్ని అటనామస్, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధుల సహకారంతో నడిచే కాలేజీలు, యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిలు, అనుబంధ కాలేజీలు వారం పాటు మూసేయాలని ఆదేశించింది. డార్జిలింగ్, కాలింపొంగ జిల్లాలకు మినహాయింపు ఇచ్చింది. కాలేజీలు, యూనివర్సిటీలు ఏప్రిల్ 17వ తేదీ నుంచి 24వ తేదీ వరకు మూసే ఉండాలని వివరించింది.

Also Read: అవార్డు కార్యక్రమంలో విషాదం.. మండే ఎండల్లో 6 గంటలు.. 11 మంది మృతి!.. 600 మందికి వడదెబ్బ

వారాంతంలో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని, ఉష్ణోగ్రతలు ఎక్కువగానే నమోదవుతాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios