Asianet News TeluguAsianet News Telugu

బెంగాల్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ.. టీఎంసీలో చేరిన మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ .. సుప్రియోకు పార్టీ కండువా కప్పి తృణమూల్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. 

West Bengal Former Union Minister Babul Supriyo joins TMC
Author
Kolkata, First Published Sep 18, 2021, 3:14 PM IST

పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ బాబుల్ సుప్రియో తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ .. సుప్రియోకు పార్టీ కండువా కప్పి తృణమూల్ కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. 

వృత్తిరీత్యా గాయకుడైన బాబుల్‌ సుప్రియో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మోడీ హయంలో తొలిసారి ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసన్‌సోల్ నుంచి రెండోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి కూడా ఆయన కేంద్రమంత్రి పదవి దక్కించుకోవడం విశేషం.

Also Read:రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, త్వరలో ఎంపీ పదవికి రాజీనామా : బాబుల్ సుప్రియో సంచలనం

అయితే, ఇటీవల బెంగాల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో బాబుల్‌ను కూడా కమలనాథులు బరిలోకి దించారు. అయితే టీఎంసీ అభ్యర్థి అరూప్‌ బిశ్వాస్‌ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. దీంతో బాబుల్‌పై బీజేపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగగా.. 12 మంది మంత్రులకు మోడీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. అందులో బాబుల్‌ కూడా వున్నారు. మరోవైపు బెంగాల్‌ బీజేపీ అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌తో ఈయనకు విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో బాబుల్‌ పార్టీ వీడతారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడం బెంగాల్ రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios