Asianet News TeluguAsianet News Telugu

దేశాన్ని గాలికొదిలి.. బెంగాల్‌లో ప్రధాని, మంత్రులు మకాం, అందుకే ఇలా: మమత ఆరోపణలు

ప్రస్తుతం దేశంలో కరోనా ఉద్ధృతికి కేంద్రమే కారణమని ఆరోపించారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ . బెంగాల్‌లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఆరు నెలల పాటు కేంద్రం మరో పని ముట్టుకోలేదని ఆమె దుయ్యబట్టారు.

west bengal cm mamata banerjee sensational comments on covid crisis ksp
Author
Kolkata, First Published May 8, 2021, 7:13 PM IST

ప్రస్తుతం దేశంలో కరోనా ఉద్ధృతికి కేంద్రమే కారణమని ఆరోపించారు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ . బెంగాల్‌లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో ఆరు నెలల పాటు కేంద్రం మరో పని ముట్టుకోలేదని ఆమె దుయ్యబట్టారు.

అధికారాన్ని అందుకునేందుకు కేంద్రమంత్రులు, ఇతర నేతలు బెంగాల్‌లోనే తిష్ట వేశారని దీదీ ఫైరయ్యారు. ఆ కారణంగానే దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయని మమతా ఆరోపించారు.  రాష్ట్రంలో డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాన్ని నెలకొల్పుతామంటూ దేశాన్ని పూర్తిగా నాశనం చేశారని సీఎం విమర్శించారు.

పార్టీ పెద్దలు సహా, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ప్రచారంలో మునిగిపోయారంటూ దీదీ ఎద్దేవా చేశారు. ఎన్నికల కమిషన్‌ సహకరించకపోయి ఉంటే వారికి కనీసం 30 సీట్లు కూడా వచ్చేవి కాదని మమత ఆరోపించారు.

Also Read:కరోనాపై పోరు: 12 మందితో టాస్క్‌ఫోర్స్, ఇక కంట్రోల్ వీరిదే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రాష్ట్రంలోని కొన్ని చోట్ల రిగ్గింగ్‌ కూడా జరిగిందని దీదీ వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఓటమిని అంగీకరించలేక బెంగాల్‌లో మతపరమైన అల్లర్లు జరిగేలా రెచ్చగొట్టేందుకు ఫేక్‌ వీడియోలను వైరల్‌ చేస్తున్నారని మమత ఆరోపించారు.

సార్వత్రిక టీకా కార్యక్రమం పూర్తి బాధ్యత కేంద్రానిదేనని వెల్లడించారు. అందుకోసం డబ్బులు వెచ్చించకుండా పార్లమెంట్‌ భవనం, ప్రధాని నివాసం, విగ్రహాల కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని మమతా బెనర్జీ విమర్శించారు. కాగా, ఇవాళ స్పీకర్ ఎన్నిక సందర్భంగా అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ను ప్రతిపక్ష బీజేపీ బహిష్కరించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios