Asianet News TeluguAsianet News Telugu

పంతం నెగ్గించుకొన్న మమత:సీఎస్ పదవికి బందోపాధ్యాయ రాజీనామా

బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి అలపన్ బందోపాధ్యాయ రాజీనామా చేశారు. 

West Bengal Chief Secretary Resigns, Named CM's Principal Advisor Amid Centre-State Row lns
Author
Kolkata, First Published May 31, 2021, 6:55 PM IST

న్యూఢిల్లీ: బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి అలపన్ బందోపాధ్యాయ రాజీనామా చేశారు. బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీకి ఆయన మూడేళ్ల పాటు ప్రధాన సలహాదారుగా వ్యవహరించనున్నారు. బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా హరికృష్ణ ద్వివేది నియమించే అవకాశం ఉంది. పశ్చిమబెంగాల్ రాష్ట్ర కేడర్ కు చెందిన 1987 ఐఎఎస్ అధికారి బందోపాధ్యాయ 60 ఏళ్లు నిండాయి. ఇవాళ ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో అతనికి మరో మూడు నెలలు పొడిగింపును కేంద్రం ఇచ్చింది.

also read:చీఫ్ సెక్రటరీని రిలీవ్ చేయలేం, చేయబోం.. ప్రధానికి మమతా ఘాటు లేఖ..!

 బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని  రిలీవ్ చేయలేమని బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఇవాళ ప్రధాని మోడీకి లేఖ రాశారు.  కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సీఎస్ ఇవాళ ఢిల్లీలో రిపోర్టు చేయాల్సి ఉంది. యాస్ తుఫాన్ సమీక్ష సమావేశానికి మమత బెనర్జీ డుమ్మా కొట్టిన కొద్ది గంటలకే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని రీకాల్ చేస్తూ ఆర్డర్స్ వచ్చాయి. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో  ఆయన పదవీకాలాన్ని మరో మూడు నెలలపాటు పొడిగించాలని బెంగాల్ సీఎం చేసిన వినతిని కేంద్రం అంగీకరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios