బాలుడితో మహిళ లైంగిక సంబంధం: చూశాడని కొడుకును చంపేసింది

West Bengal 7-yr-old murdered by mother and her teenage lover after he saw them in compromising position
Highlights

బాలుడితో మహిళ లైంగిక సంబంధం: చూశాడని కొడుకును చంపేసింది

28 ఏళ్ల ఓ మహిళ తన ఇంటి పక్కనే ఉన్న 14 ఏళ్ల బాలుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరూ ఏకాంతంగా ఉండగా చూసిన పాపానికి ఆమె తన ఏడేళ్ల కొడుకును అతి దారుణంగా గొంతు నులిమి హత్య చేసింది .  ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని పరగణాస్ జిల్లాలో  చోటుచేసుకుంది.

రాజాపూర్ గ్రామ నివాసి గోస్తో మొండల్ భార్య సాగరి (28). ఈ దంపతులకు ఏడేళ్ల చిన్నారి సాధన్ ఉన్నాడు. వీరి పొరుగింటికి సర్దార్ తన భార్యతో కలిసి కోల్‌కతాలో నివాసం ఉంటున్నారు. అతడి కుమారులు రిషి (14), ఆనంద్ (12) సొంతూరులోనే ఉంటూ విద్యాభ్యాసం సాగిస్తున్నారు. 

రిషితో సాగరి చనువు పెంచుకుంది. భర్త బయటకి వెళ్లినప్పుడల్లా రిషి ఇంటికి రప్పించుకొని శారీరక వాంఛ తీర్చుకుంటోంది. గత గురువారం సాధన్ ఆరుబయట ఆడుకుంటుండగా.. గోస్తో ఇంట్లో లేని సమయం చూసి రిషి.. సాగరి వద్దకు వచ్చాడు. వారిద్దరూ ఏకాంతంగా గడుపుతుండగా.. ఆరుబయట ఆడుకుంటున్న సాధన్ అకస్మాత్తుగా ఇంట్లోకి వచ్చాడు. 

తన తల్లితో రిషి అసభ్యకరంగా ఉండటాన్ని చూసి షాక్‌కు గురైన సాధన్.. ఈ విషయాన్ని తన తండ్రికి చెబుతానంటూ అతణ్ని బెదిరించాడు. దీంతో అతడు వేగంగా వచ్చి సాధన్‌ను గట్టిగా పట్టుకున్నాడు. ఇంతలో సాగరి వచ్చి తన కుమారుడి మెడకు చున్నీతో ఉరి బిగించి ఊపిరాడకుండా చేసి హతమార్చింది. 

 

loader