Weather update: దేశ రాజధాని ఢిల్లీ, ముంబయి సహా భారత్ లోని అనేక నగరాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే వర్షం కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు, నీటి ఎద్దడి ఏర్పడింది. గోవా, కేరళ, మహారాష్ట్ర, రెండు తెలుగు రాష్ట్రాలు సహా అనేక ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
Heavy rains across the country: ఆలస్యంగా దేశాన్ని తాకిన రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా కదులుతున్నాయి. దీంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న మరికొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే వర్షం కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్‌లు, నీటి ఎద్దడి ఏర్పడింది. గోవా, కేరళ, మహారాష్ట్ర, రెండు తెలుగు రాష్ట్రాలు సహా అనేక ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, కొంకణ్, గోవాలలో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గుజరాత్ లో శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. రానున్న ఐదు రోజుల్లో కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్ లోని ఘాట్ ప్రాంతాల్లో తేలికపాటి లేదా మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. కొంకణ్, గోవాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య భారతంలో తేలికపాటి లేదా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. విదర్భ, ఛత్తీస్ గఢ్ లలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
కేరళను ముంచెత్తిన భారీ వర్షాలు..
కేరళలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నీరు నిలిచిపోవడం, చెట్లు నేలకూలడం, భవనాలు దెబ్బతినడంతో ఇడుక్కి, కాసర్ గఢ్, కన్నూర్ సహా మూడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన 11 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పరిస్థితిని సమీక్షించడానికి ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామనీ, సున్నితమైన ప్రాంతాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కు చెందిన పలు బృందాలను మోహరించామని అధికారులు తెలిపారు. రెవెన్యూ మంత్రి కే.రాజన్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్లు, ఇతర రెవెన్యూ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగిందనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్ కోరారు.
గోవాకు రెడ్ అలర్ట్..
భారీ వర్షాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, చెట్లు నేలకూలడం, భవనాలు కూలిపోవడం, నిత్యావసర సేవలకు స్వల్పకాలిక అంతరాయం కలుగుతుందని వాతావరణ శాఖ గోవాకు 'రెడ్' అలర్ట్ జారీ చేసింది. రెండు హెల్ప్ లైన్లు, కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. బుధవారం కోస్తా ప్రాంతాల్లో 76.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..
మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ అమలులో ఉందనీ, అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ హెచ్చరించింది. రాయ్ గఢ్ జిల్లాలో జూన్ లో సగటు వర్షపాతం 655 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది జిల్లాలో మొత్తం 70 శాతం సగటు వర్షపాతంతో 459 మిల్లీమీటర్లు నమోదైంది. జూలై మొదటి నాలుగు రోజుల్లో 188 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక ముంబయిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కోస్తా కర్ణాటకకు ఆరెంజ్ అలర్ట్
దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడిపి జిల్లాల్లో జూలై 8 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో కోస్తా కర్ణాటకకు ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంది. దక్షిణ కన్నడ జిల్లాలో మంగళ, బుధవారాల్లో పాఠశాలలు, అంగన్ వాడీలు, ప్రీ యూనివర్శిటీ కాలేజీలకు సెలవు ప్రకటించారు.
దేశరాజధానిలో..
ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రాబోయే కొన్ని గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు తీవ్రత కలిగిన వర్షాలు కురుస్తాయని ఐంఎడీ తెలిపింది. రాగల రెండు గంటల్లో ఢిల్లీ పరిసర ప్రాంతాలు, దిల్షాద్ గార్డెన్, సీమాపురి ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
పంజాబ్లో ఒకరు మృతి..
పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. డెహ్లాన్ ప్రాంతానికి సమీపంలో ఫ్యాక్టరీ షెడ్ కూలిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. బాధితుడిని ఉత్తరప్రదేశ్ లోని దిర్మార్ భర్ గ్రామానికి చెందిన సురీందర్ కుమార్ గా గుర్తించినట్లు లుధియానా (సెంట్రల్) అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రాజేశ్ శర్మ తెలిపారు.
హిమాచల్ లో ఆకస్మిక వరదలు..
హిమాచల్ ప్రదేశ్ లోని ఉనా జిల్లాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో హరోలి ప్రాంతంలో సుమారు 10 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
