Asianet News TeluguAsianet News Telugu

రెజర్ల సమస్యలను సీరియస్‌గా తీసుకుంటాం : హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్

రెజర్లు చేపడుతున్న నిరసనను తాము సీరియస్ గా తీసుకుంటామని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. మహిళా అథ్లెట్ల భద్రత తమ ప్రభుత్వానికి చాలా ముఖ్యమైనదని తెలిపారు. 

We will take the problems of residents seriously: Haryana CM Manohar Lal Khattar
Author
First Published Jan 19, 2023, 5:24 PM IST

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా దేశంలోని అగ్రశ్రేణి రెజ్లర్లు నిరసన దీక్షలు కొనసాగిస్తున్న సంగతి తెలిసింది. అయితే ఈ అంశాలను తాము సీరియస్‌గా తీసుకుంటామని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు.

Sophos layoffs: భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల‌కు షాకిచ్చిన సోఫోస్.. ! 

‘‘మా మహిళా అథ్లెట్ల భద్రత చాలా ముఖ్యమైనది. మేము దానిని తీవ్రంగా పరిగణిస్తాం. మేము వారి మనోధైర్యాన్ని తగ్గించబోము. మేము వారి మనోధైర్యాన్ని తగ్గించబోము. అథ్లెట్లు లేవనెత్తిన అన్ని సమస్యలను తీవ్రంగా పరిగణిస్తాము’’ అని సీఎం వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో అన్నారు. ఈ అంశంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నాకే రక్షణ లేనప్పుడు సాధారణ మహిళ పరిస్థితి ఏంటీ?: ఓ కారు డ్రైవర్ తనను ఈడ్చుకెళ్లాడన్న స్వాతి మలివాల్

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నియంతృత్వంగా వ్యవహిరిస్తోందని, పలువురు తమపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రెజర్లు ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ నిరసనలకు ప్రఖ్యాత రెజర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగట్ నేతృత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ సందర్భంగా గురువారం రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడుతూ.. రెజర్లు తమ హక్కుల కోసం పోరాడగలిగితేనే, క్రీడారంగంలో దేశం కోసం కోసం పోరాడగలరని అన్నారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడి నియంతృత్వానికి వ్యతిరేకంగా క్రీడాకారులు ఐక్యంగా నిలబడతారని, వారికి రాజకీయ నాయకుల సహాయం అవసరం లేదని ఆయన అన్నారు.

‘‘ఆటగాళ్లను ఆదుకోవడం, వారి క్రీడా అవసరాలు తీర్చడం సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) పని. సమస్య వస్తే పరిష్కరించాలి.. కానీ సమాఖ్యలే సమస్యను సృష్టిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం పోరాడాలి. వెనక్కి తగ్గేది లేదు.’’ అని బజరంగ్ బుధవారం హిందీలో ట్వీట్ చేశారు. అయితే ఈ నిరసన జరుగుతున్న ప్రదేశానికి ప్రభుత్వం తరుఫున మధ్యవర్తిత్వం వహించడానికి రెజ్లర్ బబితా ఫోగట్ చేరుకున్నారు. ఈ విషయంపై నిష్పక్షపాత దర్యాప్తు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

గత ప్రభుత్వాలు కుల, మతాలను సమస్యలుగా మార్చాయి.. మేము అభివృద్ధిని తీసుకొచ్చాం: కర్ణాటకలో ప్రధాని మోడీ

నిరసన చేపడుతున్న రెజర్లు నేటి మధ్యాహ్నం సమయంలో క్రీడా మంత్రిత్వ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం బజరంగ్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారులతో జరిగిన సమావేశం విషయంలో తాము సంతృప్తి చెందామని పేర్కొన్నారు. రెజర్లు చేపడుతున్న నిరసనలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. ఆ పార్టీ నాయకులైన జైరాం రమేష్, ప్రియాంక గాంధీ ఈ అంశంపైనే గురువారం ట్వీట్ చేశారు. రెజర్లు చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని, బాధ్యులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios