Asianet News TeluguAsianet News Telugu

నాకే రక్షణ లేనప్పుడు సాధారణ మహిళ పరిస్థితి ఏంటీ?: ఓ కారు డ్రైవర్ తనను ఈడ్చుకెళ్లాడన్న స్వాతి మలివాల్

ఢిల్లీలో మహిళా కమిషన్‌ స్వాతి మలివాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. రాజధానిలో మహిళ రక్షణను పరిశీలించడానికి ఆమె తన టీమ్‌తో కలిసి ఎయిమ్స్ దగ్గరికి నిన్న తెల్లారి 3.11 గంటల ప్రాంతంలో వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి ఆమెను కారులోకి బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు. కానీ, ఆమె తప్పించుకుని కిటికీలో నుంచి అతడిని పట్టుకున్నారు. కానీ, ఆ డ్రైవర్ కారు అద్దాలు పైకి ఎక్కించడంతో చేయి అందులో ఇరుక్కుపోయింది. చేతిని వెనక్కి తీసుకోవడానికి 15 మీటర్లు కారు వెంటే పరుగెట్టాల్సి వచ్చింది.
 

if iam not safe then how common women asks dcw chief swati maliwal
Author
First Published Jan 19, 2023, 3:57 PM IST

న్యూఢిల్లీ: ‘నేను ఢిల్లీ మహిళా కమిషన్ అధ్యక్షురాలిని. ఇక్కడ నాకే రక్షణ దిక్కు లేదు. ఇక సాధారణ మహిళల గురించి ఆలోచించండి’ అంటూ ఢిల్లీ కమిషన్ ఫర్ విమెన్ చీఫ్ స్వాతి మాలివాల్‌ను ట్వీట్ చేశారు. మద్యం మత్తులో ఉన్న ఓ కారు డ్రైవర్ 15 మీటర్లు తనను ఈడ్చుకెళ్లారని ఆమె ఆరోపించారు. ఈ కేసులో 47 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఢిల్లీలోని ఎయిమ్స్ సమీపంలో ఓ వ్యక్తి ఆమెను వేధించారని, ఈడ్చుకెళ్లారని ఆమె ట్వీట్ చేశారు. రాజధానిలో మహిళల రక్షణ ఎలా ఉన్నదో పరిశీలించాలని స్వాతి మలివాల్ నిర్ణయించుకున్నారు.. అందుకే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆమె తన టీమ్‌తో కలిసి ఎయిమ్స్ సమీపంలోకి వెళ్లారు. అప్పుడే మద్యం  మత్తులో కారులో వచ్చిన ఓ వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పేర్కొన్నారు. కారులో ఉన్న అతన్ని కిటికీ గుండా గట్టిగా పట్టుకున్నారని వివరించారు. కానీ, కారు అద్దాలు క్లోజ్ చేయడంతో తన చేతిని ఇరికించేశారని తెలిపారు. అప్పుడు సుమారు 15 మీటర్లు ఆ కారు వెంటే పరుగెత్తానని, దాదాపు తనను ఈడ్చుకెళ్లినంత పని చేశాడని ఆరోపించారు. 

ఆ దేవుడే తన ప్రాణాలు రక్షించాడని వివరించారు. ఢిల్లీలో ఒక మహిళా కమిషన్ చైర్మన్ పరిస్థితే ఇలా ఉంటే... ఒక సాధారణ మహిళ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి? అని తెలిపారు. 

Also Read: సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగపోతే.. బాధితులు ఎక్కడికి వెళ్లాలి: డీసీడబ్యూ చీఫ్ స్వాతి మలివాల్

తెల్లవారుజామున 3.11 గంటల ప్రాంతంలో నిన్న ఆమె ఎయిమ్స్ పేవ్‌మెంట్ దగ్గర ఉన్నారు. బాలెనో కారులో హరీష్ చంద్ర అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆమెను తన కారులోకి లాక్కోడానికి ప్రయత్నించాడు. ఆయన ఫుల్‌గా మద్యం మత్తులో ఉన్నాడని ఆమో పోలీసులకు తెలిపారు. ఆమె టీమ్ కొంత దూరంలో ఉండి ఆమె కోసం వెయిట్ చేస్తున్నది.

కారులో ఎక్కడానికి ఆమె నిరాకరించడంతో కారు ముందుకు వెళ్లి మళ్లీ యూటర్న్ తీసుకుందని స్వాతి మలివాల్ తెలిపారు. ఆమె బలవంతంగా ఆమెను కారులోకి ఎక్కించుకోవడానికి ప్రయత్నించగా ఆమె చాకచక్యంగా విండో నుంచి డ్రైవర్‌ను పట్టుకోగలిగింది. కానీ, ఆ డ్రైవర్ విండో గ్లాస్ పైనకి రోల్ చేశాడు. ఫలితంగా ఆమె చేయి అందులో ఇరుక్కుపోయింది. 

ఆమె చేయి అందులో ఇరుక్కుపోయి ఉన్నప్పటికీ కారును అలాగే ముందుకు పోనిచ్చాడు. సుమారు 15 మీటర్లు ఆమె కారుతోపాటే పరుగెత్తాల్సి వచ్చింది. ఆ తర్వాతే కారు కిటికీలో నుంచి చేతిని బయటికి తీసుకోగలిగింది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కారును సీజ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios