india vs australia : వరల్డ్ కప్ ఫైనల్ ను ఆపేస్తాం - ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ హెచ్చరిక..
india vs australia world cup 2023 : అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను జరగనివ్వబోమని నిషేధిత ఖలిస్తానీ సంస్థ ‘సిక్కుస్ ఫర్ జస్టిస్’ వ్యవస్థాపకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు. ఈ మేరకు అతడు ఓ వీడియో విడుదల చేశారు.
india vs australia world cup 2023 : దేశం మొత్తం ఉత్కంఠతో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ కోసం ఎదురుచూస్తోంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అయితే ఈ ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను నిలిపివేస్తామని ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హెచ్చరించారు.
వీడియో గేమ్స్ కు బానిసయ్యాడని ఫోన్ లాక్కున్న తండ్రి.. మనస్థాపంతో 16 ఏళ్ల కుమారుడు ఆత్మహత్య..
నిషేధిత ఖలిస్తానీ సంస్థ ‘సిక్కుస్ ఫర్ జస్టిస్’ వ్యవస్థాపకుడైన అతడు తాజాగా ఓ వీడియో విడుదల చేశాడు. అందులో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడారు. అలాగే ముస్లిం, క్రైస్తవ వర్గాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై భారత్ వైఖరి గురించి కూడా పన్నూన్ మాట్లాడారు.
ప్రపంచ కప్ 2023 : కప్పుకొట్టడం కాదు, బంతిని పిచ్చకొట్టుడు కొట్టండి.. టీమిండియాకు సద్గురు సలహా..
కాగా.. పన్నూన్ బెదిరింపు వీడియోను విడుదల చేయడం ఇదే మొదటిసారి కాదు. అక్టోబర్ లో కూడా ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం నుంచి పాఠాలు నేర్చుకోవాలని, లేనిపక్షంలో భారత్ లోనూ ఇలాంటి 'ప్రతిచర్య' తలెత్తుతుందని ప్రధాని నరేంద్ర మోడీని హెచ్చరించారు.
అలాగే సెప్టెంబర్ లో ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కు ముందు కూడా ఇలాంటి బెదిరింపులు జారీ చేయడం, శత్రుత్వాన్ని ప్రోత్సహించారనే ఆరోపణలపై పోలీసులు గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.