రేషన్ షాపుల్లో మోడీ ఫొటో ఎందుకు ? మేం పెట్టబోం - కేరళ సీఎం పినరయ్ విజయన్
కేరళ (kerala)లో రాష్ట్రంలో ఉన్న రేషన్ షాపుల్లో (ration shops) ప్రధాని నరేంద్ర మోడీ (pm narendra modi)ఫోటోను పెట్టబోమని ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ (kerala cm pinarayi vijayan) తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో రేషన్ పంపిణీ వ్యవస్థను నడుపుతోందని, ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు.
కేరళలోని రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోలు, పోస్టర్లు ఎందుకు అని ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర వైఖరిని ఆయన తోసిపుచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు సరైనవి కావని, వాటిని కేరళ అమలు చేయడం కష్టమని సీఎం తేల్చి చెప్పారు.
ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శిపై కాల్పులు, దారుణ హత్య.. ఓవైసీ ఆగ్రహం..
రేషన్ షాపుల వద్ద ప్రధాని నరేంద్ర మోడీ ఫొటోను ఉంచాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరిస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోమవారం శాసనసభలో తెలిపారు. సభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు సీఎం సమాధానమిస్తూ.. రేషనింగ్ వ్యవస్థ, రేషన్ దుకాణాలు రాష్ట్రం చాలా కాలంగా అమలు చేస్తోందని తెలిపారు. అయినా గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శించారు.
రానున్న లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పినరయ్ విజయన్ ఆరోపించారు. కానీ ఈ విషయంలో కేరళ తమ అసమ్మతిని కేంద్రానికి తెలియజేస్తుందని తెలిపారు. ‘‘అలా చేయడం కష్టమని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లవచ్చో లేదో కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది’’ అని ఆయన అన్నారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట విషాదం.. సోదరుడు మృతి
కాగా.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద నిర్మించిన ఇళ్లలో బ్రాండింగ్ కార్యక్రమం చేపట్టాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను కూడా కేరళ తిరస్కరించింది. ఇళ్ల వద్ద పీఎంఏవై లోగోను ప్రదర్శించాలని కేంద్రం సూచించింది. అయితే ఇల్లు కట్టుకోవడం ప్రాథమిక మానవ హక్కు అని, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానికి ప్రకటనగా వాడుకోవడం సరికాదని సీఎం మీడియాతో తెలిపారు.
రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీపై కీలక ప్రకటన.. ఒకే విడతలో..
వివిధ రాష్ట్ర, కేంద్ర పథకాలను మేళవించిన ప్రభుత్వ ఉచిత గృహనిర్మాణ పథకం లైఫ్ మిషన్ కింద ఇళ్ల ఖర్చులో అధిక భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని పినరయ్ విజయన్ గుర్తు చేశారు. పీఎంఏవై-జీ కింద కేంద్ర వాటా రూ.72,000 అని తెలిపారు. లైఫ్ మిషన్ కింద లబ్ధిదారుడికి రూ.4 లక్షలు ఇస్తున్నామని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు.