ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శిపై కాల్పులు, దారుణ హత్య.. ఓవైసీ ఆగ్రహం..
ఏఐఎంఐఎం నాయకుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దుండుగులు కాల్పులకు ఒడిగట్టారు. దీంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యారు. (AIMIM leader shot dead) స్థానికులు ఆయనను హాస్పిటల్ కు తీసుకెళ్లినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో మరణించారు.
ఏఐఎంఐఎం (ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్) నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన బీహార్ లోని గోపాల్ గంజ్ లో జరిగింది. బీహార్ కు ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి, గోపాల్ గంజ్ కు జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న అస్లాం ముఖియా అలియాస్ అబ్దుల్ సలాం సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు.
రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీపై కీలక ప్రకటన.. ఒకే విడతలో..
గోపాల్ గంజ్ కు 2022లో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన ఎంఐఎం తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. సోమవారం రాత్రి ఆయనపై గుర్తు తెలియని దుండగులు తుర్కహాలో కాల్పులకు పాల్పడ్డారు. దీంతో స్థానికులు, ఆయన అనుచరులు వెంటనే సదర్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో ఆయన మరణించాడు.
అంగన్ వాడీ జాబ్స్ ఇప్పిస్తామని.. 20 మంది మహిళలపై గ్యాంగ్ రేప్.. వీడియో తీసి పదే పదే..
కాగా.. బీహార్ లో ఎంఐఎం నేతను కాల్చి చంపడం ఇది రెండోసారి. అయితే సలాం మృతి పట్ల ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంతాపం వ్యక్తం చేశారు. బీహార్ సీెం నితీశ్ కుమార్ పై నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు.
‘‘మాజీ ఉప ఎన్నికల అభ్యర్థి, ఎంఐఎం రాష్ట్ర కార్యదర్శి అబ్దుల్ సలాం అలియాస్ అస్లాం ముఖియాను కాల్చి చంపారు. ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాను. గత ఏడాది డిసెంబర్ లో మా సివాన్ జిల్లా అధ్యక్షుడు ఆరిఫ్ జమాల్ ను కాల్చి చంపారు. నితీష్ కుమార్ మీరు మీ కుర్చీని కాపాడుకోవడం పూర్తయిన తరువాత కొంత పని చేయండి. మా నాయకులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వారి కుటుంబాలకు న్యాయం జరుగుతుందా?’’ అని పేర్కొన్నారు.