Asianet News TeluguAsianet News Telugu

1995లో కేసీఆర్ కు నేనే మంత్రి పదవి ఇప్పించా.. పాలేరులో పార్టీ శ్రేయస్సు కోసమే పోటీ చేశా - తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ సీఎం కేసీఆర్ కు 1995లో తానే మంత్రి పదవి ఇప్పించానని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కానీ ఈ సంగతి మర్చిపోయి, తనపైనే దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది దురదృష్టకరం అని తెలిపారు.

In 1995, I gave the post of minister to KCR.. I contested in Paleru only for the welfare of the party - Tummala Nageswara Rao..ISR
Author
First Published Oct 28, 2023, 9:09 AM IST

Thummala Nageswara Rao  : ఖమ్మం జిల్లాలోని పాలేరులో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ మాజీ మంత్రి తుమ్ముల నాగేశ్వరావుపై విమర్శలు గుప్పించారు. దీనికి తుమ్మల స్సందించారు. శుక్రవారం సాయంత్రం సమయంలో ఖమ్మంలోని పలు డివిజన్లలో జరిగిన ఆత్మీయ సమావేశాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ తన స్థాయిని మరిచి పచ్చి అబద్దాలు మాట్లాడారని ఆరోపించారు. 

పట్టాలపై ఇరుక్కుపోయిన ట్రాక్టర్.. పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం..

సీఎం కేసీఆర్ తనకు మంత్రి పదవి ఇప్పించారని చెబుతున్నారని.. కానీ 1995లో ఆయనకు తానే మంత్రి పదవి ఇప్పించానని తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు. ఈ విషయం ఆయన మర్చిపోయారని విమర్శించారు. గోదావరి జలాలను పాలేరుకు తెప్పించి, 10 లక్షల ఎకరాలకు నీరందించాలన్నదే తన కోరిక అని వ్యాఖ్యానించారు. అందుకే తాను కాంగ్రెస్ నుంచి ఎన్నికల్లో బరిలో దిగుతున్నానని చెప్పారు. 

అలిపిరి - తిరుమల నడక మార్గంలో చిరుత, ఎలుగుబంటి కలకలం.. భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ

2018లో జరిగిన ఎన్నికల్లో పాలేరులో తాను ఓడిపోయానని, కానీ దానికి కారణం ఎవరో సీఎం కేసీఆర్ అంతరాత్మకు తెలుసని తుమ్మల అన్నారు. పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి ఇచ్చేందుకు కేటీఆర్ తన ప్రత్యర్థికి డబ్బులు ఇచ్చారని, తనను ఓడించారని చెప్పారు. పాలేరుకు వచ్చిన ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ నుంచి ఎవరూ ముందుకు రాలేదని నాగేశ్వరరావు అన్నారు. అయితే పార్టీ శ్రేయస్సు కోసమే తాను పాలేరులో పోటీ చేసేందుకు అంగీకరించానని గుర్తు చేశారు. ఈ విషయాలు మర్చిపోయి సీఎం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది చాలా దురదృష్టకరం అని అన్నారు.

దారుణం.. వివాహితను 20 రోజులు గదిలో బంధించి వాలంటీర్ అత్యాచారం..

కాగా.. పాలేరు సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కు తుమ్మల నాగేశ్వరరావు అన్యాయం చేశారా... తుమ్మల నాగేశ్వరరావు   బీఆర్ఎస్ కు అన్యాయం చేశారో చెప్పాలని అన్నారు. పువ్వాడ అజయ్ చేతిలో  ఓటమి పాలై  తుమ్మల నాగేశ్వరరావు  కూర్చుంటే తానే బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్టుగా  చెప్పారు. ఎమ్మెల్సీని ఇచ్చి కేబినెట్ లోకి తీసుకున్నట్టుగా కేసీఆర్ గుర్తు చేశారు.  పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట్ రెడ్డి  మరణిస్తే  జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావును గెలిపించుకున్నామన్నారు. ఐదేళ్ల పాటు  ఖమ్మం జిల్లాను తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగిస్తే  ఏం చేశారని ఆయన  ప్రశ్నించారు. ఐదేళ్లు తుమ్మల నాగేశ్వరరావుకు అప్పగిస్తే  గుండు సున్నా  ఇచ్చారన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios