New Delhi: అవినీతి, బంధుప్రీతి నుంచి భారత్ ను విముక్తం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలకు భిన్నంగా అందరినీ కలుపుకుని పోయే కొత్త రాజకీయ సంస్కృతికి బీజేపీ నాయకత్వం వహిస్తోందని చెప్పారు.
Prime Minister Narendra Modi: బీజేపీ పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని ప్రసంగంలోని కీలక వ్యాఖ్యలు
- అవినీతి, బంధుప్రీతి, శాంతిభద్రతల సవాళ్ల నుంచి భారత్ ను విముక్తం చేసేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. హనుమంతుడిలా 'చేయగలం' అనే వైఖరితో బీజేపీ సంకల్పించిందని, అవినీతిపై పోరాడాలని కృతనిశ్చయంతో ఉందన్నారు.
- వంశపారంపర్యం, కులతత్వం, ప్రాంతీయతలకు బందీలుగా ఉన్న కాంగ్రెస్, ఇతర పార్టీలకు భిన్నంగా అందరినీ కలుపుకుని పోయే కొత్త రాజకీయ సంస్కృతిని నేడు బీజేపీ ముందుకు తీసుకెళ్తోంది.
- 1947లో బ్రిటీష్ వారు వెళ్లిపోయినా బానిసత్వం అనే మనస్తత్వం అలాగే ఉండిపోయింది. స్వాతంత్య్రానంతరం అధికారాన్ని తన జన్మహక్కుగా భావించే ఒక వర్గం దేశంలో వర్ధిల్లిందన్నారు.
- సామాజిక న్యాయం పేరుతో అనేక రాజకీయ పార్టీలు దేశంతో ఆడుకుంటున్నాయన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాకుండా వారి కుటుంబాల సంక్షేమానికి భరోసా ఇచ్చారు. కానీ బీజేపీకి సామాజిక న్యాయం అనేది మరో రాజకీయ నినాదం మాత్రమే కాదని తెలిపారు.
- ద్వేషంతో నిండిన వారు అబద్ధాలను ఆశ్రయిస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపరులైన వీరు ఇప్పుడు బయటపడేందుకు ఒకే ఒక మార్గం చూసుకుంటున్నారని, "మోడీ తేరీ కబర్ ఖుదేగీ" అని బహిరంగంగానే చెబుతున్నారని విమర్శించారు.
Scroll to load tweet…
బీజేపీ స్థాపన దివస్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గురువారం ఉదయం న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జెండాను ఎగురవేశారు. వేలాది మంది బీజేపీ కార్యకర్తల కృషి 2024లో మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. 'సామాజిక సామరస్య' వారోత్సవాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన కోరారు. అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, పార్టీ నేతలకు ఇదే విషయం గురించి లేఖ రాశారు.
