Asianet News TeluguAsianet News Telugu

లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం - జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జేడీ(ఎస్) స్వతంత్రంగా పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ స్పష్టం చేశారు. తమ పార్టీ ఒకటి, రెండు సీట్లు మాత్రమే గెలిచినా కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని ఆయన తేల్చి చెప్పారు.

We will contest the Lok Sabha elections alone - JDS chief and former Prime Minister Deve Gowda..ISR
Author
First Published Jul 25, 2023, 2:36 PM IST

లోక్ సభ ఎన్నికల్లో జనతాదళ్ (సెక్యులర్) స్వతంత్రంగా పోటీ చేస్తుందని మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ అన్నారు. కార్యకర్తలను సంప్రదించి, ఆ తరువాత పార్టీ బలంగా ఉన్న సెగ్మెంట్లలో మాత్రమే జేడీఎస్ అభ్యర్థులను నిలబెడుతుందని దేవెగౌడ వార్తా సంస్థ ‘పీటీఐ’తో తెలిపారు. ఇటీవల కర్నాటక మాజీ ముఖ్యమంత్రి  కుమార స్వామి తమ పార్టీ జేడీ(ఎస్), బీజేపీ ప్రతిపక్షంగా సహకరించుకుంటాయని ప్రకటించిన నేపథ్యంలో తాజా నిర్ణయం వెలువడింది.

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోంది - డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

తమ పార్టీ ఐదు, ఆరు, మూడు, రెండు లేదా ఒకటి సీట్లు గెలిచినా లోక్ సభ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని దేవెగౌడ స్పష్టం చేశారు.‘‘మా కార్యకర్తలతో సంప్రదించిన తరువాత మేము బలంగా ఉన్న ప్రదేశాలలో మాత్రమే అభ్యర్థులను నిలబెడతాము’’ అని అన్నారు. పార్టీకి సంబంధించి అధికారికంగా ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి పార్టీ అగ్రనేత హెచ్‌డీ దేవెగౌడ తనను అనుమతి ఇచ్చారని, పార్లమెంటు ఎన్నికలపై చర్చించడానికి ఇంకా సమయం ఉందని కుమారస్వామి గతంలో చెప్పారు. 

2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్‌డీఏతో జేడీ (ఎస్) పొత్తు పెట్టుకునే అవకాశం ఉందన్న వార్తల మధ్య గౌడ వెళ్లిన జేడీ(ఎస్) కౌన్సిల్ పార్టీ సమావేశంలో గురువారం రాత్రి జరిగిన సంభాషణలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. బీజేపీ, జేడీఎస్ రెండూ ప్రతిపక్ష పార్టీలు కావడంతో రాష్ట్రంపై న్యాయమైన ఆందోళన నేపథ్యంలో సహకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. నిజానికి ఈ రోజు ఉదయం కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎలా ముందుకెళ్లాలనే దానిపై మాట్లాడారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్న ప్రతిపక్షాలు.. కారణమేంటంటే ?

సామాజిక కార్యక్రమాల నేపథ్యంలో ప్రతీ నాయకుడిని అంచనా వేయడానికి, పార్టీ అసోసియేషన్ కోసం, మొత్తం 31 జిల్లాల్లో ఈ (కాంగ్రెస్) ప్రభుత్వ అక్రమాలకు వ్యతిరేకంగా గళం విప్పడానికి 10 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ‘‘పార్లమెంటు ఎన్నికలకు ఇంకా 11 నెలల సమయం ఉంది. మరి పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో చూడాలి’’ అని అన్నారు.

మాజీ ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసు.. నిర్దోషిగా తేలిన హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా

ఇదిలా ఉండగా.. కర్ణాటకలో జేడీఎస్, బీజేపీలు కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తున్నాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. తమ రాజకీయ లబ్ది కోసం ఏదో ఒక రాజకీయ ప్రక్రియను అనుసరిస్తున్నారని, కానీ ఏదీ పనిచేయదని అన్నారు. తమ ప్రభుత్వం దృఢంగా, సుస్థిరంగా ఉందన్నారు. బెంగళూరులో, ఢిల్లీలో సమావేశాలు ఏర్పాటు చేస్తే తమకు తెలిసిపోతుందనే ఉద్దేశంతో సింగపూర్ కు వెళ్తున్నారని తెలిపారు.  కాగా.. ఈ ఏడాది మే నెలలో జరిగిన 224 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కు 135, బీజేపీకి 66, జేడీఎస్ కు 19 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios